లోక్సభాపతిగా ఓం బిర్లా ఎన్నికవడంపై తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. దేశాభివృద్ధి కోసం సభ సజావుగా జరిగేలా చూడాలని సభాపతిని కోరారు. తెదేపా ఎంపీల సంఖ్య తగ్గినా... సభలో మాట్లాడేందుకు సమయం మాత్రం తగ్గించవద్దని కోరారు. దేశ, రాష్ట్ర సమస్యలపై తెదేపా ఎంపీల వాణి వినాలని విన్నవించారు. మాజీ సభాపతి సుమిత్రా మహాజన్.. చర్చల్లో పాల్గొనేందుకు యువతను ఎంతగానో ప్రోత్సహించేవారని గుర్తు చేశారు. ప్రజల మంచి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను సమర్థిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి