ETV Bharat / state

దైవసాక్షిగా... జగన్మోహన్​ రెడ్డి ప్రమాణం - cm jagan

రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్​మోహన్​రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ నరసింహన్‌ జగన్‌తో ప్రమాణం చేయించారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం, గ్యాలరీ అభిమానులతో నిండిపోయింది.

జగన్ ప్రమాణం
author img

By

Published : May 30, 2019, 12:27 PM IST

Updated : May 30, 2019, 1:41 PM IST

జగన్ ప్రమాణం

రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైకాపా అధినేత జగన్మోహన్​రెడ్డి దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్​ నరసింహన్​ జగన్​ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. జగన్​ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన అతిథులు, జగన్‌ కుటుంబ సభ్యులు అనుసంధానంగా ఏర్పాటు చేసిన వేదికపై ఆశీనులయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌ జగన్​కు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక వేదిక ముందు వరుస గ్యాలరీలో హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయాధికారులు, జగన్‌ బంధువులు, వేదిక ముందున్న ఏ2 గ్యాలరీలో ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు కూర్చున్నారు. ఏ2 గ్యాలరీలో పార్టీ నేతలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, బి1 గ్యాలరీలో ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ అధికారులు, బి2 గ్యాలరీలో బార్‌ అసోసియేషన్‌ సభ్యులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు, వేదిక ముందు, చివరలో సాధారణ ప్రజానీకం వీక్షించారు. స్టేడియం లోపల 30 వేలమంది, బయట 10 వేలమంది ప్రమాణస్వీకారం తిలకించారు. స్టేడియం బయట ఉన్న అభిమానులు భారీ తెరల ద్వారా జగన్​ ప్రమాణ స్వీకారం వీక్షించారు. జగన్​ ప్రమాణం చేసేటప్పుడు తన పేరు చెప్పేటప్పుడు అభిమానులు, కార్యకర్తల నుంచి భారీ ఎత్తున స్పందన వెల్లువెత్తింది.

ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్​ నరసింహన్​ జగన్​కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ కు పంపగలరు.
కంట్రీ బ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం
Ap_Atp_46_30_Jayanti_Garuda_Anjaneya_Temple_AV_C8

Body:ఒకప్పుడు ఆ గుడి నిత్య పూజలలు, ధూప దీప నైవేద్యాలతో పవిత్రతను చాటేది. కాలక్రమేనా దేవాదాయ శాఖ పట్టించుకోని కారణంగా శిథిలావస్థకు చేరింది. గుడికి ఆనుకొని ఉన్న పవిత్ర తీర్థం(కోనేరు) వ్యర్థాలతో పూడి పోయింది. ఆలయ విశిష్టతను పట్టణానికి చెందిన పెద్దల ద్వారా తెలుసుకున్న యువత ఆపవిత్ర ఆలయ పునరుద్ధరణకు ముందుకు వచ్చారు. అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పరిధిలోని శ్రీ గరుడ ఆంజనేయ స్వామి గుడి కొద్దిరోజులుగా శిథిలావస్థకు చేరుకుంది. పట్టణానికి అతి సమీపంలో మధ్య లేరు వాగుపై ఉన్న గరుడ ఆంజనేయ స్వామి గుడి పరిసరాలు ఆక్రమణలకు గురయ్యాయి. ఆలయం ఎదుట ఉన్న గరుడ తీర్థము పిచ్చి మొక్కలు, వ్యర్థాలతో పూడిపోయింది. ఆలయ ప్రత్యేకతను తెలుసుకున్న కొందరు యువకులు శ్రీఖాద్రీ రక్షక దళ్ పేరిట సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి కొందరి సహకారంతో గరుడ ఆంజనేయ స్వామి ఆలయం , గరుడ తీర్థం పరిసరాలను శుభ్రం చేసేందుకు ముందుకు వచ్చారు. యువకులు చొరవతో ఆలయ పరిసరాలు కొత్త రూపు సంతరించుకున్నాయి. గుడి మొత్తం రంగులు వేయించారు. ఆలయ ఆవరణంలో మొక్కలు నాటారు. ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా కాషాయ ధ్వజాలను ఏర్పాటు చేశారు. మంగళ, శనివారాలు అంజనీ పుత్రుడు కి పూజలు ప్రారంభించారు. గరుడ ఆంజనేయ స్వామి పూజ లందుకుంటున్న విషయాన్ని తెలుసుకుని గుడికి వస్తున్న స్థానికుల సంఖ్య క్రమంగా పెరుగు తోంది. మరింత మంది భక్తులకు గరుడ తీర్థ పవిత్రతను తెలియ చెప్పాలనే ఉద్దేశంతో రక్షక దళ సభ్యులు హనుమజ్జయంతి ని గరుడ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నిర్వహించారు. కార్యక్రమానికి స్థానికులు తరలివచ్చి ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దిన రక్షక దళ సభ్యులను అభినందించారు.

Conclusion:బైట్
బాబ్జి, శ్రీ ఖాద్రి రక్షక్ దళ్ అధ్యక్షుడు
Last Updated : May 30, 2019, 1:41 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.