కృష్ణా కరకట్టపై కట్టడాల అంశంలో సీఆర్‌డీఏ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. చందన బ్రదర్స్ భవనానికి ఇచ్చిన స్టే ఎత్తివేయాలని సీఆర్‌డీఏ వాదనలు వినిపించింది. ఈ భవనానికి స్టే ఇస్తే... మిగిలిన యజమానులూ అనుమతి కోరతారని వాదన వినిపించింది. కాగా... నోటీసులిచ్చే అధికారం సీఆర్‌డీఏకు లేదని చందన కేదారీశ్వరరావు తరపు న్యాయవాది వాదించారు.
సీఆర్‌డీఏ చట్టం నాలుగేళ్ల క్రితమే వచ్చిందన్న న్యాయవాది... భవనాన్ని తాను 20 ఏళ్ల క్రితమే కట్టానని యజమాని తెలిపారు. నదీగర్భంలో రివర్ కన్జర్వేషన్ యాక్ట్ ఉల్లంఘించి నిర్మించారన్న సీఆర్‌డీఏ వాదించగా... అక్రమ కట్టడానికి అనుమతి ఎలా ఇచ్చారని భవన యజమాని తరపు న్యాయవాది ప్రశ్నించారు. ఈ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు ప్రస్తుతం రిజర్వులో ఉంచింది.
ఇదీ చదవండీ...