ETV Bharat / state

'గ్రాఫిక్స్​తో అమరావతిని..భ్రమరావతిగా మార్చారు' - undefined

బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభ్యులు మాట్లాడిన..అంశాలపై ఆర్థిక మంత్రి బుగ్గన వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వాన్ని విమర్శించారు.

finance minister_buggana_clarification_on_ap_budger_2019
author img

By

Published : Jul 17, 2019, 4:09 PM IST

అమ్మ ఒడి బడికి పంపే తల్లులకు మాత్రమే!

శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి బుగ్గన సభ్యులు మాట్లాడిన అంశాలపై వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో పిల్లలను బడికి పంపే తల్లులకు మాత్రమే అమ్మఒడి పథకం వర్తిస్తుందని ఆర్థిక మంత్రి బుగ్గన తెలిపారు. ఒక తల్లికి పిల్లలు ఎంత మంది ఉన్నా....ప్రభుత్వం కేటాయించే మొత్తం 15 వేలేనని తెలిపారు. 43 లక్షల మంది తల్లులకు పథకం వర్తింపజేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వం గ్రాఫిక్స్‌తో అమరావతిని భ్రమరావతిగా మార్చిందని బుగ్గన విమర్శించారు. ఐదేళ్లలో రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ఖజానా నుంచి కేవలం 277 కోట్లు మాత్రమే కేటాయించారని అన్నారు. ఈ ప్రభుత్వం అమరావతికి తగిన ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.

'ధరల స్థిరీకరణ కింద రూ.3 వేల కోట్లు కేటాయించాం. పశువులు, గొర్రెలకు కూడా బీమా కేటాయిస్తున్నాం. పింఛన్ల కింద అధిక నిధులు కేటాయించాం. బీసీ సంక్షేమానికి గత ప్రభుత్వం రూ.11 వేల కోట్లు కేటాయించి రూ.6,600 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ ప్రభుత్వం రూ.15,061 కోట్లు కేటాయించింది అని బుగ్గన పేర్కొన్నారు. 'గత ప్రభుత్వ పథకాలు చూస్తే ఆశ్చర్యమేస్తోంది. వనం-మనం, మీ ఇంటికి మీ భూమి, హ్యాపీ సండే, జలహారతి పథకాలు పెట్టారు. టెలీకాన్ఫరెన్స్‌లు పెట్టి ఉద్యోగులను ఇబ్బంది పెడుతుంటే హ్యాపీ సండే ఎక్కడుంది... దోమలపై దండయాత్ర అన్నారు.. ఏం చేశారో అర్థం కావట్లేదు. నీరు-చెట్టు కింద రూ.793 కోట్లు కేటాయించారు.. రూ.4,850 కోట్లు ఖర్చు చేసినట్లు చూపారు.' అని తెదేపాపై బుగ్గన విమర్శలు గుప్పించారు.

Mumbai, July 16 (ANI): Bollywood actor Shraddha Kapoor was seen outside a dance studio in Mumbai. She posed for shutterbugs too. Meanwhile, actor Varun Dhawan was also seen outside the same studio. Dhawan was spotted head to toe in black. Both will be seen together in 'Street Dancer'.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.