ETV Bharat / state

హోదా ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకోండి: జగన్​

దిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. రెవెన్యూ లోటు భర్తీ, ప్రత్యేక హోదా ఆవశ్యకత వివరించిన జగన్‌... రాష్ట్ర విభజన సమయంలోనే ఏపీకి తీవ్ర నష్టం జరిగిందన్నారు. 59 శాతం జనాభా ఉన్న రాష్ట్రానికి 47 శాతమే ఆదాయం పంచారని లెక్కలు చెప్పారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
author img

By

Published : Jun 15, 2019, 4:32 PM IST

Updated : Jun 16, 2019, 12:00 AM IST

హైదరాబాద్ తెలంగాణకు వెళ్లడం వల్ల ఏపీ బాగా నష్టపోయిందన్న సీఎం జగన్‌... ఏపీ కేవలం వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మిగిలిందని వివరించారు. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం చాలా తక్కువని... ఈ నష్టం పూడ్చేందుకే ఆనాటి కేంద్రప్రభుత్వం హోదా హామీని ఇచ్చిందని గుర్తుచేశారు. హోదా హామీని అప్పటి అధికార, విపక్ష పార్టీలు నిలబెట్టుకోలేదని పేర్కొన్నారు.

2014లో రూ.97 వేల కోట్లున్న అప్పు... నేటికి 2.59 లక్షల కోట్లకు చేరిందని ముఖ్యమంత్రి జగన్‌ నీతిఆయోగ్ సమావేశంలో చెప్పారు. అసలు, వడ్డీ కలిపి ఏడాదికి రూ.40 వేల కోట్ల భారం ఏపీపై పడుతోందన్న సీఎం... ఏపీలో ఉపాధి కల్పన అవకాశాలు దారుణంగా పడిపోయాయని వివరించారు. ఏపీలోని యువత వలసలు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. హోదా మాత్రమే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కొంతవరకు పూడ్చగలదని స్పష్టం చేశారు.

14వ ఆర్థికసంఘం సూచన ఆధారంగా హోదా ఇవ్వబోరనే వదంతులు వచ్చాయన్న సీఎం జగన్‌...హోదా రద్దుకు సిఫారసు చేయలేదని 14వ ఆర్థికసంఘం సభ్యుడే పేర్కొన్న విషయం గుర్తుచేశారు. ఆ సభ్యుడు అభిజిత్‌ సేన్‌ రాసిన లేఖనూ మీకు అందిస్తున్నాని అన్నారు. ప్రత్యేక హోదా వల్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా వచ్చే మొత్తం పెరుగుతుందని జగన్‌ వివరించారు. హోదా వల్ల పారిశ్రామిక రాయితీలు, పన్ను రాయితీలు వస్తాయన్న ముఖ్యమంత్రి... ఉద్యోగ కల్పన పెరిగి నిరుద్యోగ సమస్య పరిష్కరించే అవకాశం వస్తుందని చెప్పారు.

హోదా ద్వారానే ఏపీకి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, స్టార్ హోటళ్లు, పరిశ్రమలు, సేవారంగాల అభివృద్ధి జరుగుతుందన్న జగన్‌...గత ఐదేళ్లలో అవినీతి పాలన వల్ల రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిందని పేర్కొన్నారు. ఐదేళ్లుగా పెట్టుబడులు లేక విద్య, వైద్యరంగాలు పతనావస్థకు చేరాయని వివరించారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక హోదా మాత్రమే ఏపీకి జీవనరేఖగా మిగిలిందన్న ముఖ్యమంత్రి... హోదాపై అనేక అపోహలు కూడా ప్రచారంలో ఉన్నాయన్నారు. 2015లో నీతి ఆయోగ్ ఏర్పడేవరకు ఏపీకి హోదా ఇచ్చేందుకు అడ్డంకి లేదన్న విషయం గుర్తుచేశారు.

ఇదీ చదవండీ...

ప్రత్యేక హోదా, ఎంపీల క్రమశిక్షణపై దృష్టి సారించిన సీఎం

Intro:kit 736.

అవనిగడ్డ నియోజక వర్గం, కోసురు కృష్ణ మూర్తి,
సెల్.9299999511.

కృష్ణాజిల్లా, అవనిగడ్డ మండలం, అవనిగడ్డలో కృష్ణమ్మ శుద్ధి సేవలో పాల్గొన్న కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్.

అవనిగడ్డలో జూనియర్ కాలేజీ ఆవరణలో ఏర్పాటుచేసిన సభలో కలెక్టర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఇతర అ అన్ని శాఖల అధికారులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కలెక్టర్ అందరితో స్వచ్ఛత గుంరించి ప్రమాణం చేయించారు.

అనంతరం అవనిగడ్డ గ్రామంలో షాపుల దగ్గరకు వెళ్లి కలెక్టర్ షాపులో ఉన్న వారికి కరపత్రాలు ఇచ్చి స్వచ్ఛత లేకుంటే కలిగే అనర్ధాలు తెలిపారు.
అవనిగడ్డ గ్రామ విధుల్లో తిరుగుతూ క్యారీ బ్యాగుల వాడకం నిషేధించాలని తడి చెత్త, పొడి చెత్త విడిగావేయాలని ప్లాస్టిక్ వాడకం వలన కలిగే అనర్ధాలు తెలిపారు. కాలుష్యం వల్ల ప్రజలకు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు, అనంతరం డంపింగ్ యార్డ్ , మంచినీటి చెరువును కలెక్టర్ పరిశీలించారు
కాలువలలో ఏవిధమైన వ్యర్ధాలు వేయారదని అలా వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు వివరించారు.
అవనిగడ్డ కూడలిలో మానవహారం నిర్వహించారు.

అవనిగడ్డలో ఉన్న సమస్యలను అధికారులు కలెక్టర్ కి వివరించారు.

Body:అవనిగడ్డలో జూనియర్ కాలేజీ ఆవరణలో ఏర్పాటుచేసిన సభలో కలెక్టర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఇతర అ అన్ని శాఖల అధికారులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కలెక్టర్ అందరితో స్వచ్ఛత గుంరించి ప్రమాణం చేయించారు.

Conclusion:అవనిగడ్డలో జూనియర్ కాలేజీ ఆవరణలో ఏర్పాటుచేసిన సభలో కలెక్టర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఇతర అ అన్ని శాఖల అధికారులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కలెక్టర్ అందరితో స్వచ్ఛత గుంరించి ప్రమాణం చేయించారు.
Last Updated : Jun 16, 2019, 12:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.