రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర పాలనపై దృష్టిపెట్టిన సీఎం జగన్.. తొలిసారిగా అధికారిక సమీక్షలకు సిద్ధమయ్యారు. నేటి నుంచి శాఖల వారీగా సమీక్షలు నిర్వహించి పరిస్థితులపై అవగహన కల్పించుకుని తదుపరి నిర్ణయాలను తీసుకోవాలని భావిస్తున్నారు. ఇవాళ ఆర్థిక శాఖతో ప్రారంభించి ఈనెల 6 తేదీ వరకూ వివిధ ప్రభుత్వ శాఖలు, రాజధాని నిర్మాణంపై సమీక్షించనున్నారు.
పాలనాపరంగా తమ ప్రభుత్వ విధానాల అమలుతో పాటు ప్రభుత్వ శాఖలపై అవగహన కోసం సీఎం జగన్ సమీక్షలు ప్రారంభించారు. తదుపరి నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వ శాఖల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులేమిటో తెలుసుకునేందుకు ఈ సమీక్షలు చేపట్టనున్నారు. ఇందుకోసం ఆయా శాఖల కార్యదర్శలు సంక్షిప్తంగా సమాచారాన్ని తీసుకురావాల్సిందిగా సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం అధికారులను ఆదేశించారు.
ఇవాళ ఉదయం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై సమీక్షించిన అనంతరం ..రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ ఆర్జన శాఖలైన అబ్కారీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, మైనింగ్, అటవీశాఖ, వాణిజ్య పన్నుల శాఖల పై సమీక్షించనున్నారు. ఈ నెల 3 తేదీన విద్యాశాఖ పై, జలవనరుల శాఖ పై సమీక్ష చేయనున్నారు. జూన్ 4 తేదీన వ్యవసాయ అనుబంధ రంగాలు, గృహా నిర్మాణ శాఖ లపై సమీక్షిస్తారు. 6వ తేదీన రాజధాని నిర్మాణం, సీఆర్డీఏ పై సమీక్షించాలని నిర్ణయించారు.
నేటి నుంచి ప్రభుత్వ శాఖలపై సీఎం జగన్ సమీక్షలు - cs lv
ముఖ్యమంత్రి హోదాలో జగన్ తొలిసారిగా అధికార సమీక్షలకు సిద్ధమయ్యారు. ఇవాళ్టి నుంచి ఈనెల 6 వ తేదీ వరకూ వివిధ ప్రభుత్వ శాఖలపై సమీక్షలు నిర్వహించనున్నారు. రాజధాని నిర్మాణం, సీఆర్డీఏ పై కూడా సమీక్షించాలని నిర్ణయించారు
![నేటి నుంచి ప్రభుత్వ శాఖలపై సీఎం జగన్ సమీక్షలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3438825-285-3438825-1559337185796.jpg?imwidth=3840)