ఎన్టీఆర్ ఒక అద్భుతమైన మానవతావాది అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ట్విట్టర్లో పేర్కొన్నారు. రాజకీయాల్లో చిత్తశుద్ధితో, నిస్వార్థంగా సేవచేయగలిగితే ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు అందించవచ్చని ఆచరణాత్మకంగా చేసి చూపించిన ఘనత ఎన్టీఆర్దని కొనియాడారు. ప్రజాసేవలో ఎన్టీఆరే స్ఫూర్తి అని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని ఆశయసాధనకు పునరంకితమవుదామని ఎన్టీఆర్, తెదేపా అభిమానులను కోరారు.
ఇదీ చదవండీ...