ఆర్థిక కారణాలతో తప్పుకున్న గెలాక్సీ..
నష్టాలను పూడ్చుకోవటమే లక్ష్యంగా ఏపీఎస్ ఆర్టీసీ 2017 ఆగస్టు 27న సరకు రవాణా ప్రాజెక్టు చేపట్టింది. ఆర్టీసీ బస్సుల ద్వారా సొంతంగా సరకు రవాణా చేపట్టి ఆదాయాన్ని పెంచుకోవటమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. అప్పట్లో గెలాక్సీ అనే సంస్థ మూడేళ్ల నిర్వహణకు తక్కువ ధరకే టెండర్లు దక్కించుకుంది. 2017 సెప్టెంబర్ 1 నుంచి నిర్వహణ బాధ్యత తీసుకుంది. ఆర్థిక కారణాలు చూపిస్తూ బాధ్యతల నుంచి తప్పుకుంది. ఒప్పందం రద్దుకు యత్నిస్తోంది.
కొత్త టెండర్లకు సిద్ధం..
గెలాక్సీ సంస్థ నిర్వాకంతో అవాంతరాలొచ్చాయి. నూతన ఏజెన్సీ నియామకానికి ఆర్టీసీ వెంటనే చర్యలు చేపట్టింది. నూతన ఏజెన్సీ కోసం జోన్ల వారీగా టెండర్లు పిలిచింది. మే 3న విజయవాడలో ఓ అవగహన సదస్సు ఏర్పాటు చేశారు. ఆసక్తి ఉన్న వారే టెండర్లు వేయాలని స్పష్టం చేసింది. వివరాలు కావాల్సిన వారి కోసం ప్రత్యేకంగా ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేసింది. నిర్ణీత కాలం వరకు బాధ్యతలు నిర్వహించకుంటే చర్యలు తీసుకునే అంశాన్ని చేర్చింది.