రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 3775 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణ, నగర ప్రాంతాల్లో వార్డు సచివాలయాల ఏర్పాటుకు అవసరమైన విధివిధానాలతో జీవో ఇచ్చింది. మొత్తం 10మంది సిబ్బంది సచివాలయాల్లో పనిచేసేలా విధివిధానాలు రూపొందించింది. వీరి శిక్షణ కార్యక్రమాలు, నియామకాలకు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. జూలై 22 తేదీన నియామకాల నోటిఫికేషన్ చేపట్టి ఆగస్టు 16 తేదీ నుంచి సెప్టెంబరు 15లోగా నియామకాలు పూర్తి చేస్తారు. అక్టోబరు రెండో తేదీ నుంచి గ్రామాలతోపాటు పట్టణాల్లో సచివాలయాలు పనిచేస్తాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 3775 వార్డు సచివాలయాల ఏర్పాటుకు ఆదేశించింది. ప్రతీ 4 వేల మందికి ఒక వార్డు సచివాలయం ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ సచివాలయం ద్వారా అర్హులైన లబ్దిదారులందరికీ నేరుగా ప్రభుత్వ సేవలు వార్షిక అభివృద్ధి ప్రణాళికలరూపకల్పన, ప్రభుత్వ పథకాలు వంద శాతం అమలే లక్ష్యంగా జీవో విడుదలైంది. వార్డు వాలంటీర్ల ద్వారా ప్రతీ 50 లేదా 100 మంది పౌరులకు సంబంధించిన అంశాల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. పన్నుల వసూలు, పరిశుభ్రత, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల అమలు పర్యవేక్షణ పురపాలికలు, నగరపాలికల్లోని వార్డు కార్యాలయం లేదా అంగన్వాడీ భవనం, పాఠశాల లేదా ఇతర ప్రభుత్వ భవనాల్లో వార్డు సచివాలయం ఏర్పాటుకు నిర్ణయంచారు. వార్డు పాలనా కార్యదర్శి, మౌలిక సదుపాయాల కార్యదర్శి, సానిటేషన్, విద్య, వార్డు ప్రణాళిక, సంక్షేమాభివృద్ధి, విద్యుత్, ఆరోగ్యం, రెవెన్యూ, వెనుకబడిన వర్గాల రక్షణ కార్యదర్శులుగా పది మందిని నియమిస్తారు.
మొత్తం 3 వేల 775 వార్డు సచివాలయాల ఏర్పాటు చేస్తారు. వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి 10 రకాల సేవలు అందించే సిబ్బందిని నియమించేందుకు విధివిధానాలు రూపోందించాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించింది. వార్డు సచివాలయాల్లో నియామకాల కోసం జూలై 22 తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 15 తేదీ వరకూ రాతపరీక్ష, ఇంటర్వూలు నిర్వహించి నియామకాలను చేపట్టాలని జీవోలో పురపాలక శాఖ స్పష్టం చేసింది. అక్టోబరు 2 తేదీ నుంచే వార్డు సచివాలయాలు అందుబాటులో ఉండేలా కార్యాచరణ చేపట్టనున్నారు.