అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో వైకాపా బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడాపురం వెంకటేష్‌పై స్థానిక వైకాపా నాయకుడు డోలా రాజారెడ్డి దాడి చేశాడు. పట్టణంలోని ప్రియాంక కాలనీలో తన వ్యక్తిగత కార్యాలయంలో వెంకటేష్ ఉన్న సమయంలో రాజారెడ్డి లోపలకు ప్రవేశించి ఇనుప రాడ్డుతో దాడికి తెగబడ్డాడు. వెంకటేష్ చేతికి బలమైన గాయమైంది. స్థానికులు వెంకటేష్‌ను చికిత్స నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు నాయకుల మధ్య ఆధిపత్య పోరే దాడికి ప్రేరేపించిందని పోలీసులు పేర్కొంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇవీ చదవండి...'నువ్వు 10మందిని తెస్తే... నేను వెయ్యి మందిని తెస్తా'