అనంతపురం జిల్లా మద్దెల చెరువు గ్రామానికి చెందిన రామాంజనేయులు తెదేపాలో చురుకుగా పని చేసేవాడు. అదే గ్రామానికి చెందిన వైకాపా నాయకులు ఎలక్షన్ల నుంచి అతడిపై కక్ష పెంచుకున్నట్లు బాధితుడి అన్న గోపాల్ తెలిపారు. ఈ క్రమంలోనే వాహనంపై వెళుతున్న తన తమ్ముడిపై దాడి చేశారని ఆరోపించారు. తరచూ వైకాపా నేతలు తమతో గొడవ పడుతుండేవారని.. అందుకే తన తమ్ముడు ఊరు విడిచి వెళ్లాడని గోపాల్ వివరించారు. తమ తండ్రి చనిపోతే.. తల కొరివి పెట్టేందుకు మద్దెల చెరువుకు వచ్చి నెల రోజులు ఉన్నాడన్నారు. ఈ క్రమంలోనే ఒంటరిగా వెళుతున్న రామాంజనేయులుపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిలో తన తమ్ముడు తీవ్రంగా గాయపడ్డాడని.. పోలీసులు నిందితులను కఠినంగా శిక్షించి.. తమకు రక్షణ కల్పించాలని బాధితుడి అన్న కోరారు.
ఇదీ చదవండి: