అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నక్కనదొడ్డి గ్రామంలో వందల ఎకరాల్లో జరుగుతున్న నిర్మాణ పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు. భూములను అధికారులు సేకరించిన సమయంలో నక్కనదొడ్డి, నరసాపురం, ఎన్కొట్టాల ప్రాంతాలకు రోడ్లు, డ్రైన్లు, ఆర్ఓ ప్లాంట్లను చేపడతామని హామీ ఇచ్చిన విషయాన్ని వారు గుర్తు చేశారు. సుమారు రూ.450 కోట్లతో ఐఓసీ నిర్మాణపు పనులు చేపట్టి మూడు సంవత్సరాలు అయింది. ఇప్పటివరకూ ఆ హామీని ఎవరూ పట్టించుకోలేదు. ఈ నిర్లక్ష్యం ఎన్నాళ్లంటూ రైతులు ధర్నా చేపట్టారు. ఐఓసీ డిపోకు వెళ్లేందుకు ప్రయత్నించిన అధికారులు చంద్రశేఖర్, దుర్గాప్రసాద్లను గ్రామస్థులు అడ్డుకున్నారు. నిరసన వ్యక్తం చేశారు. డిపోలో పనులు జరగకుండా కార్మికులు బయటకు పంపివేశారు. అధికారులు ఇచ్చిన హామిలు నెరవేర్చే వరకు పనులు జరగేది లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: