ETV Bharat / state

గుప్త నిధుల హత్యకేసులో దర్యాప్తు ముమ్మరం

అనంతపురం జిల్లాలో ముగ్గురు వ్యక్తుల హత్య కేసుకు సంబంధించి 8 మంది నిందితులను... కదిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యతో ప్రత్యక్ష సంబంధం ఉన్న నిందితులను అరెస్టు చేశామని... త్వరలోనే అందరినీ పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.

అనంతపురం గుప్త నిధుల హత్య కేసులోని నిందితులను అదుపులోకి తీసుకున్న కదిరి పోలీసులు
author img

By

Published : Nov 1, 2019, 6:04 PM IST

గుప్త నిధుల హత్యకేసులో దర్యాప్తు ముమ్మరం

గుప్త నిధుల కోసం ముగ్గురిని కిరాతకంగా హత్య చేసిన కేసులో... 8 మంది నిందితులను కదిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది జులై 14న తనకల్లు మండలం కొర్తికోట శివాలయం ఆవరణలో... నిద్రిస్తున్న ముగ్గురిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. 4 నెలలుగా దర్యాప్తు కొనసాగింది. పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకొని... అనంతపురం, చిత్తూరు జిల్లాలతోపాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు.

బాధితుల ఫిర్యాదు ఆధారంగా గుప్త నిధుల కోసం హతమార్చారా... వేరే ఏదైనా కారణాలతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేసినట్లు తెలిసింది. తాజాగా దర్యాప్తు బృందం 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుంది. వీరిని గాండ్లపెంట స్టేషన్​లో ఉంచి... కదిరి గ్రామీణ సీఐ, తనకల్లు, గాండ్లపెంట ఎస్సైలు విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ హత్యతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవారు వీరిలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ఇదీ చదవండి:

గుప్త నిధులపై ఆశలు... తీస్తున్నాయి ప్రాణాలు

Intro:రిపోర్టర్ : కె. శ్రీనివాసులు
సెంటర్   :  కదిరి
జిల్లా      : అనంతపురం
మొబైల్ నం     7032975449
Ap_Atp_47_01_Policeula_Adupulo_Nindirulu_AV_AP10004
నోట్: నిన్న పంపిన Ap_Atp_47_31_Policeula_Adupu_Lo_Ninditulu_AV_AP10004 స్లగ్ విజువల్స్ వాడుకోగలరు

Body:గుప్త నిధుల కోసం ముగ్గురిని కిరాతకంగా హత్య చేసిన కేసులు అనంతపురం జిల్లా కదిరి పోలీసులు ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు . ఈ ఏడాది ఇది జులై 14న తనకల్లు మండలం కొర్తికోట శివాలయం ఆవరణలో నిద్రిస్తున్న ముగ్గురిని దారుణంగా హత్య చేశారు. హత్య అనంతరం నిందితులకు ఇలాంటి సమాచారం దొరక్కపోవడంతో కేసు దర్యాప్తు నాలుగు నెలలపాటు కొనసాగింది . పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకొని అనంతపురం చిత్తూరు జిల్లాలతోపాటు కర్ణాటక, రాష్ట్రాలకు చెందిన అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు . గుప్త నిధుల కోసం హత మార్చారా, లేక ఏదైనా కారణాలతో నిందితులు ఘాతుకానికి పాల్పడ్డారా అనే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు సాగినట్లు తెలిసింది .బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు భిన్న కోణాలలో దర్యాప్తు చేశారు. తాజాగా ముగ్గురి హత్య కేసు దర్యాప్తు బృందం 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుంది. వీరిని కదిరి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని గాండ్లపెంట స్టేషన్ లో ఉంచి కదిరి గ్రామీణ సి ఐ , తనకల్లు, గాండ్ల పెంట ఎస్సైలు నిందితులను విచారిస్తున్నట్లు తెలిసింది. వీరిలో హత్యలో ప్రత్యక్ష పాత్ర ఉన్న నిందితులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. త్వరలోనే హత్య కేసును చేధించి నిందితులను అరెస్టు చూపుతామని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.