రాష్ట్ర స్థాయి అండర్-17 హాకీ పోటీలు ఉత్కంఠ భరితంగా సాగాయి. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం సనప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడు రోజుల నుంచి జరుగుతున్న పోటీలు నేటితో ముగిశాయి. ఫైనల్ పోటీల్లో బాలుర విభాగంలో అనంతపురం... వైజాగ్ జట్లు హోరా హోరిగా తలపడ్డాయి. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ పోటీల్లో అనంతపురం జట్టు విజేతగా నిలిచింది. బాలికల విభాగం ఫైనల్ పోటీల్లో కడప... అనంతపురం జిల్లా జట్లు తలపడగా.. కడప జిల్లా జట్టు విజేతగా నిలిచింది. పోటీల్లో గెలుపొందిన వారికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ ట్రోఫీలు ప్రదానం చేశారు. వచ్చే నెల 17న ఛత్తీస్‌ఘడ్‌లో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు 18మందిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: ఆత్మవిశ్వాసమే..శ్వాసగా సాగిపోతున్న సుశీల..!