ETV Bharat / state

చదవలేం శిథిలావస్థ బడిలో... నెట్టుకొస్తున్నాం ప్రకృతి ఒడిలో... - fully damaged urvakonda govt school

ఆ పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు చెట్ల నీడలే తరగదులు. శిథిలావస్థ చేరిన బడిలో ఉండలేక ప్రకృతి ఒడినే నమ్ముకున్నారు.  ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

ఆరుబయటే చదువులు
author img

By

Published : Nov 1, 2019, 1:23 PM IST

ఆరుబయటే చదువులు

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం నెరిమట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమస్యలకు నిలయంగా మారింది. సుమారు 20 ఏళ్ల క్రితం నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకూ 165 మంది విద్యార్థులు ఇక్కడ చదవుకుంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తడిసిన గదుల పైకప్పులు, గోడలు పెచ్చులూడి పడుతున్నాయి. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవటం లేదు.
బడి పని వేళల్లో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్న ఉపాధ్యాయులు చెట్ల కిందే పాఠాలు చెబుతున్నారు. పాఠశాల దుస్థితి వివరించి నూతన నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపినా అధికారయంత్రాంగంలో స్పందన లేదని వాపోతున్నారు ఇక్కడి ఉపాధ్యాయులు.
ఆర్డీటీ సంస్థ దాదాపు రూ.60 లక్షలతో ఐదు గదులు నిర్మాణానికి ముందుకొచ్చినా... ఆ పనులు మధ్యలోనే ఆపేశారు. అధికారులు స్పందించి వెంటనే కొత్త భవనాలు కట్టించాలని విద్యార్థులు అర్థిస్తున్నారు.

ఇదీ చదవండి: చదువు ఒత్తిడి, అవమాన భారంతో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

() ఆ పాఠశాలలో విద్యార్థులు అసౌకర్యాల నడుమ చదువులు కొనసాగిస్తున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులు రోజు ఆరుబయట వరండాలో చదువులు కొనసాగించాల్సిన పరిస్థితి. పాఠశాల తరగతి గదులు శిథిలావస్థకు చేరి ఉండడమే ఇందుకు కారణం.

ఉరవకొండ మండలం నెరిమెట్ల జడ్పీ ఉన్నత పాఠశాల నిర్మించి సుమారు 20 ఏళ్ళ కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు 165 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ ఏడాది కురిసిన వర్షాలకు పాఠశాల తరగతి గదుల పైకప్పులు, గోడలు, పెచ్చులూడుతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఉపాధ్యాయులు భయాందోళనకు గురవుతున్నారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని రోజులుగా అన్ని తరగతుల విద్యార్థులకు పాఠశాల వరండాలో చెట్లకింద కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారు.

ఉపాద్యాయులు పాఠాలు చెప్పే సమయంలో గదుల పైకప్పులు పెచ్చులూడుతున్నాయని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని భయంతో ఉన్నామని విద్యార్థులు అంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి నూతన తరగతి గదులు నిర్మించాలి విద్యార్థులు కోరుకుంటున్నారు.

పాఠశాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిన ఫలితం శూన్యం.

పాఠశాలకు పది నూతన తరగతి గదులు అవసరమని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపిన ఫలితం లేదు. ఆర్డిటి సంస్థ దాదాపు 60 లక్షలతో 5వ తరగతి గదుల నిర్మాణానికి ముందుకు వచ్చింది. పాఠశాల గదుల నిర్మాణాన్ని చేపట్టిన పనులు మధ్యలోనే ఆపేశారు. అధికారులు స్పందించి సరిపడా నిధులు మంజూరు చేసి ఇబ్బందులు లేకుండా చూడాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

Body:బైట్స్ : విద్యార్థులు.

Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuram (D)
date : 01-11-2019
sluge : ap_atp_71_01_school_rooms_damage_avb_AP10097
cell : 9704532806
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.