అనంతపురం జిల్లా గుంతకల్లులో దొంగలు బీభత్సం సృష్టించారు. బెంగళూరు నుంచి ముంబయి వెళ్లే నాగర్ కోయిల్ ఎక్స్ప్రెస్ రైల్లో వృద్ధ దంపతుల వద్ద 14.4 తులాల బంగారం దోచుకెళ్లారు. గుంతకల్లులోని రామస్వామి కాలనీకి చెందిన లక్ష్మయ్య, విశాలాక్షి దంపతులు బెంగళూరు నుంచి గుంతకల్లు వచ్చేందుకు నాగర్ కోయిల్ ఎక్స్ప్రెస్ రైల్లోని ఎస్-4 బోగీలో ప్రయాణించారు. రైలు స్టేషన్కు చేరుతుండగా నిద్ర లేచిన వారు శౌచాలయానికి వెళ్లారు. తిరిగి వచ్చి చూసే సరికి వారి బ్యాగులోని బంగారు నగలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. దీనిపై వారు జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఎలక్ట్రానిక్ వస్తువులే లక్ష్యంగా దోపిడీ.. ఇద్దరి అరెస్ట్