ఇదీ చదవండి :
కందిపప్పు కోసం రెవెన్యూ అధికారి కక్కుర్తి - revenue officer
అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఓ రెవెన్యూ అధికారి నిర్వాకం వైరల్ అవుతోంది. కిరాణా సరుకులను తరలిస్తోన్న ఆటోను అడ్డుకున్న రెవెన్యూ అధికారి... తనకు మూడు ప్యాకెట్ల కందిపప్పు ఇస్తేనే ఆటోను విడిచిపెడతానన్నాడు. ఇప్పుడీ ఫోను సంభాషణలు కలెక్టర్ వద్దకు వెళ్లడం వలన రెవెన్యూ అధికారి స్థానిక నేతలు చుట్టూ తిరుగుతున్నాడు.
కందిపప్పు కోసం రెవెన్యూ అధికారి కక్కుర్తి... చిరువ్యాపారికి బెదిరింపులు
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఓ రెవెన్యూ అధికారి చిరు వ్యాపారులను బెదిరించిన ఫోను సంభాషణ వైరల్ అవుతున్నాయి. ఆదివారం ఉదయం రాయదుర్గానికి చెందిన కొందరు కిరాణా వ్యాపారులు బళ్లారి నుంచి కందిపప్పు, తదితర నిత్యావసర వస్తువులను ఆటోలో తీసుకొస్తున్నారు. మార్గమధ్యలో ఓ రెవెన్యూ అధికారి ఆటోను నిలిపి డ్రైవరును ప్రశ్నించాడు. ఈ సరుకులన్నీ కిరాణా దుకాణాలకు సంబంధించిన వ్యాపారులవని ఆటో చోదకుడు చెప్పాడు. మూడు ప్యాకెట్ల(ఒకటిన్నర క్వింటాల్) కందిపప్పును తనకు ఇస్తేనే ఆటోను వదులుతానని రెవెన్యూ అధికారి బెదిరించాడు. ఆటో డ్రైవరు రాయదుర్గంలోని కిరాణా వ్యాపారికి ఫోన్ చేసి విషయాన్ని చెప్పి, రెవెన్యూ అధికారితో మాట్లాడించాడు. తాను మూడు ప్యాకెట్ల కందిపప్పు దించుకుంటున్నానని రెవెన్యూ అధికారి చెప్పాడు. వ్యాపారి ప్రాధేయపడినా పట్టించుకోకుండా కందిపప్పు 50కిలోల బస్తాను, 40 కేజీల పుట్నాల పప్పు మూటను దౌర్జన్యంగా తన జీపులోకి వేయించుకుని అనంతపురం వైపు తీసుకెళ్లారు. ఈ సంభాషణ రికార్డు చేసిన చిరువ్యాపారి.. కలెక్టర్ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. అధికారి తీరుపై ఆగ్రహించిన కలెక్టర్ కంది బస్తాలను తక్షణమే వ్యాపారులకు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. కందిపప్పు తిరిగి ఇచ్చేందుకు స్థానిక నేతల ద్వారా రెవెన్యూ అధికారి మంతనాలు చేస్తున్నాడు. సోమవారం ఉదయం తన కార్యాలయానికి రావాలని రెవెన్యూ అధికారిని ఆదేశించారు.
ఇదీ చదవండి :
Intro:ap_knl_23_18_attempt_sucide_ab_AP10058
యాంకర్, భర్త తిట్టడంతో మనస్తాపం చెందిన ఓ మహిళ కూరగాయలు కోసే కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించింది. కర్నూలు జిల్లా నంద్యాల సాయిబాబానగర్ చెందిన లక్ష్మిదేవి అనే మహిళ కడుపు పై కత్తితో పొడుచుకుంది. నడవడిక సరిగలేదని భర్త శ్రీనివాసులు తిట్టడంతో ఇలా చేసుకుంది. నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతుంది.
Body:కత్తితో పొడుచుకుని మహిళ ఆత్మహత్యాయత్నం
Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా

Last Updated : Aug 18, 2019, 11:55 PM IST