అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట సీపీఎం శ్రేణులు, వామపక్ష నేతలు నిరసన చేపట్టారు. నోటీసులు ఇవ్వకుండా పన్నులు పెంచారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. లేనిపక్షంలో పలు రకాలుగా తమ నిరసన తెలియజేస్తామన్నారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. తమపై పన్నులు భారం అధికంగా పడుతుందని వినియోగదారులు తెలిపారు. ఇది ప్రభుత్వ నిర్ణయమని తాము తీసుకున్న నిర్ణయం కాదని మున్సిపల్ కమిషనర్ వివరణ ఇచ్చారు. ప్రజల సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
పన్నులు పెంచడంపై వామపక్షాల నిరసన
అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట సీపీఎం శ్రేణులు, వామపక్షాల నేతలు పన్నులు తగ్గించాలంటూ నిరసనలు చేపట్టారు. నోటీసులు ఇవ్వకుండా గృహ, నీటి పన్నులు పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు.