మానవతా విలువలు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో... ఓ వరాహానికి పాలిచ్చి ఆకలి తీర్చిందో శునకం. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని బోయవీధిలో జరిగింది ఈ ఘటన. వరాహానికి పాలిస్తున్న దృశ్యాన్ని స్థానికులు ఎంతో ఆసక్తిగా గమనించారు. జాతి వైరాన్ని మరిచి... వరహానికి అమ్మలా ఆకలి తీర్చిన దృశ్యం గుండెల్ని హత్తుకునేలా ఉంది. ఒక జీవి ఆకలి తీర్చేందుకు జాతి అడ్డుకాదని శునకం నిరూపించింది. కుక్కకు భయపడి అమడ దూరం పరిగెత్తే వరాహాం.. ఎంచక్కా పాలు తాగి ఆకలి తీర్చుకుంది.
ఇదీ చదవండి: ఈ నగరానికి ఏమైంది...? ఒకవైపు చెత్త... మరోవైపు గుంతలు!