అనంతపురం జిల్లా గుంతకల్లులో ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టేందుకు 'కేజీ ప్లాస్టిక్ తీసుకురండి.. 6 కోడిగుడ్లు పట్టుకెళ్లండి' అంటూ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పట్టణంలోని కోళ్ల ఫామ్ యజమాని సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి, మున్సిపల్ అధికారులు కలిసి ఈ వినూత్న కార్యక్రమం చేపట్టారు. ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇదేకాక 'లీవ్ ప్లాస్టిక్ - సేవ్ గుంతకల్లు' పేరుతో ప్లాస్టిక్ నిరోధంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌ను పారదోలాలంటూ నినాదాలు చేస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ఈ కార్యక్రమాలకు విద్యార్థి, ఉపాధ్యాయ, వ్యాపార వర్గాలు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. పట్టణంలో ప్లాస్టిక్ లేకుండా చేయడమే తమ ధ్యేయమని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి..