ప్రమాదంపై ఎంపీ గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడారు. అనంతపురం నుండి కర్నూలు కలెక్టర్ కార్యాలయానికి వెళ్తున్న సమయంలో.. రోడ్డు దాటుతున్న రైతు ద్విచక్ర వాహనాన్ని తన కారు ఢీ కొట్టిందని ఎంపీ తెలిపారు. వెంటనే స్పందించి క్షతగాత్రుణ్ని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వెంకటేశ్వరరెడ్డి చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని తానే భరిస్తానని... అతని కుటుంబానికి గోరంట్ల మాధవ్ హామీ ఇచ్చారు. వెంకటేశ్వరరెడ్డి ఆరోగ్యం మెరుగుపడేలా చూడాలని వైద్యులను ఎంపీ గోరంట్ల మాధవ్ కోరారు.
ఇదీ చదవండి :