కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని మైలవరం మండలం గొల్లపల్లె గ్రామంలో నాలుగు నెలల చిన్నారిని నీటి కుంటలో పడేసిందా తల్లి. పాపకు ఆరోగ్యం బాగాలేదని.. హాస్పిటల్కు తీసుకువెళ్తున్నానని ఇంట్లోవాళ్లకు చెప్పిన ఆమె.. మైలవరం మండలం గొల్లపల్లె గ్రామం వద్ద నీటి కుంటలో కుమార్తె జోష్నను పడేసి కడతేర్చింది. అనంతరం.. పాపను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. అనుమానంతో ఆరా తీసిన పోలీసులు... కొన్ని గంటల వ్యవధిలోనే చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నారు. భర్త రోజూ హింసించడం తట్టుకోలేక తనూ చనిపోవాలి అనుకుని... చివరికి పాపను చంపానని పోలీసులకు చెప్పింది. సుభాషిణిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి...