ETV Bharat / state

భార్యపై స్నేహితులతో కలిసి భర్త అత్యాచారం - భార్యపై స్నేహితులతో కలిసి అత్యాచారం చేసిన భర్త

కట్టుకున్న భార్యను అత్యాచారం చేశాడు ఓ భర్త. భర్త అత్యాచారం చేయడమేంటీ అని అనుకుంటున్నారా..? భార్యపై అనుమానంతో ఆ ప్రబుద్ధుడు స్నేహితులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కదిరిలోని ఓ గ్రామంలో జరిగింది.

husband raped his wife with friends in anantapur dst
చికిత్స పొందుతున్న బాధితురాలు
author img

By

Published : Dec 4, 2019, 9:04 AM IST

Updated : Dec 4, 2019, 1:25 PM IST

కట్టుకున్న భార్యపైనే దారుణానికి ఒడిగట్టిన భర్త

అనంతపురం జిల్లా కదిరిలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ భర్త కిరాతకానికి ఒడిగట్టాడు. కట్టుకున్న భార్యను.. స్నేహితుడితో కలిసి మంచానికి కట్టేసి.. ఇద్దరూ కలిసి అత్యాచారం చేశారు. నాలుగు రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలు శనివారం పుట్టింటికి వెళ్ళింది. కూతురు ఆరోగ్య పరిస్థితిపై అనుమానం కలిగిన బాధితురాలి తల్లి ఆమెను ప్రశ్నించింది. భర్త చేసిన దారుణాన్ని బాధితురాలు తల్లికి చెప్పింది. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయాలతో బాధపడుతున్న ఆమెను చికిత్స నిమిత్తం కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు పర్వీన్ భాను.. బాధితురాలిని పరామర్శించారు. తన పట్ల క్రూరంగా వ్యవహరించిన భర్త, ఆయన స్నేహితుణ్ని కఠినంగా శిక్షించాలని బాధితురాలు వేడుకుంటోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి

తల్లీబిడ్డను పెట్రోలు పోసి... తగలబెట్టారు..!

Intro:రిపోర్టర్ శ్రీనివాసులు
సెంటర్ కదిరి
జిల్లా అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_49a_03_Cruel_Husband_AV_AP10004Body:కట్టుకున్న భార్యపై అమానుషంగా వ్యవహరించిన ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతున్న అనంతపురం జిల్లా కదిరి మండలం మహిళను పలువురు పరామర్శించారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు పర్వీన్ భాను బాధిత మహిళలను పరామర్శించి ఆమె నుంచి వివరాలు తెలుసుకున్నారు. కదిరి డి.ఎస్.పి షేక్ లాల్ అహ్మద్ బాధిత మహిళలను పరామర్శించారు. బాధితురాలి భర్త, ఆయన స్నేహితుడు మహిళలు బంధించి గాయపరిచిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.Conclusion:
Last Updated : Dec 4, 2019, 1:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.