అనంతపురం జిల్లా పుట్లూరు మండలం మడుగుపల్లి గ్రామానికి చెందిన శేఖర్... తన భార్య వెంకటలక్ష్మిని తొమ్మిది నెలలుగా వేధిస్తున్నాడు. కాపురానికి రాని కారణంగా కోపంతో రగలిపోయిన శేఖర్...సోమవారం రోకలి రాయితో తల పై కొట్టి అతి కిరాతకంగా భార్యను హత్యచేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ శ్రీనివాసులు హంతకుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇవీ చదవండి