ETV Bharat / state

విద్యార్థుల కోసం.. ఉపాధ్యాయురాలి వినూత్న ప్రయత్నం - thadipatri government high school

నాణ్యమైన విద్యతోపాటు నైతిక విలువలను కూడా నేర్పిస్తున్నారు.. అనంతపురం జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు. విద్యార్థుల్లో నిజాయితీని పెంచేందుకు వినూత్న ప్రయత్నం చేశారు. సొంత ఖర్చులతో నిజాయితీ పెట్టెను నిర్వహిస్తున్నారు.

honesty_box
author img

By

Published : Nov 11, 2019, 7:45 PM IST

విద్యార్థలకోసం.. వినూత్న ప్రయత్నం

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం యర్రగుంటపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి... విద్యార్థులను సన్మార్గంలో నడిపేందుకు తన వంతుగా కృషి చేస్తున్నారు. పాఠశాల.. పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. పెన్సిళ్లు, పెన్నులు, పుస్తకాలులాంటి చిన్న చిన్నవి కొనాలన్నా నగరానికి వెళ్లాల్సిందే. పాఠశాలలో తమ వస్తువులు పోతున్నాయంటూ ప్రధానోపాధ్యాయురాలికి తరచూ ఫిర్యాదులు అందుతుండేవి.

నిజాయితీ పెట్టె ఏర్పాటు

తెలిసీ తెలియని వయసులో చేసే చిన్న చిన్న దొంగతనాలను నివారించాలని విజయలక్ష్మి సంకల్పించారు. విద్యార్థులకు అవసరమైన వస్తువులను అందుబాటులోకి తీసుకురావడం సహా ఇతరుల వస్తువులు చోరీ చేయాలనే భావనను పూర్తిగా పోగొట్టేందుకు 'నిజాయితీ పెట్టె'ను ఏర్పాటుచేశారు.

విద్యార్థుల్లో సత్ప్రవర్తన పెంచేందుకే

ఈ నిజాయితీ పెట్టెలో విద్యార్థులకు అవసరమైన పాఠశాల సామాగ్రిని ఉంచుతున్నారు. విద్యార్థులు తమకు ఏ వస్తువు అవసరమో.... ఆ వస్తువును ఎవరి అనుమతి లేకుండా తీసుకుని.... అందుకు సరిపడా నగదును అందులో వేయవచ్చు. ఆ సమయంలో తమ వద్ద నగదు లేకపోతే.... తర్వాతెప్పుడైనా ఆ పెట్టెలో డబ్బులు వేయవచ్చు. ఇలా రెండేళ్లుగా పాఠశాలలో నిజాయితీ పెట్టెను సమర్థంగా నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో సత్ప్రవర్తన పెంపొందించేందుకు చేసిన ప్రయత్నం మంచి ఫలితాన్నిస్తోందని ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

సెల్‌ఫోన్‌లో మాట్లాడాలంటే.. సాహసం చేయాల్సిందే

Intro:*ఆ పెట్టెతో విద్యార్థులకు ఎన్ని ఉపయోగాలో..
*సొంత ఖర్చులతో నిజాయితీ పెట్టె నిర్వహణ..
*సత్పలితాన్నిస్తున్న ప్రధానోపాధ్యాయిని ప్రయోగం..

మొక్కై వంగనిది మానై వంగదంటారు. అందుకే చిన్న వయసులో సాధారణ విద్యతోపాటు నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని నిర్ణయించుకున్నారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులు తెలిసీ తెలియని వయసులో తమ దగ్గర లేని వస్తువులను మిత్రుల దగ్గర నుంచి తస్కరించి పరిస్థితులు సహజం. పరిస్థితి మారకపోతే వీరు నిజజీవితంలో నిజాయితీని కోల్పోయిన సమాజం దృష్టిలో చెడ్డవారిగా మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు.. అందుకే విద్యార్థి దశలోనే అందరూ సన్మార్గంలో నడవాలన్న ఉద్దేశంతో సొంత ఖర్చులతో "నిజాయితీ పెట్టె" నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతోంది అనంతపురం జిల్లా, తాడిపత్రి మండలం యర్రగుంటపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని విజయలక్ష్మి. ఈమె విద్యార్థులకు అందిస్తున్న సేవలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం..

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం యర్రగుంటపల్లి గ్రామం పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉండి. గ్రామంలోని విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల పాఠశాల సామాగ్రి ఇక్కడ లభించదు. పాఠశాల సామాగ్రి కోసం విద్యార్థులు పట్టణానికి వెళ్లాల్సిందే. అత్యవసర సమయాల్లో తమకు అవసరమైన సామాగ్రిని (పెన్ను పెన్సిల్ రాత పుస్తకం స్కేల్ రబ్బరు తదితరాలు) ఇతర విద్యార్థుల నుంచి అడిగి తీసుకోవడమో, దొంగలించడమో చేయాలి. తమ వస్తువులు దొంగలించ బడ్డాయని రోజు విద్యార్థుల నుంచి ఫిర్యాదులు అధికంగా వస్తుండేవి.. విద్యార్థుల్లో దొంగతనం చేయాలనే భావనను రూపుమాపి నిజాయితీని నింపాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే నిజాయితీ పెట్టె.. ఈ పెట్టెలో విద్యార్థులకు కు అవసరమైన పాఠశాల సామాగ్రి అంతా ఉంచుతారు. ఎవరికి ఏ వస్తువు అవసరం ఉంటుందో ఆ వస్తువును ఎవరి అనుమతి లేకుండా వెళ్లి తీసుకోవచ్చు. ఆ వస్తువును సరిపడ నగదు వేయొచ్చు.. నగదు లేని విద్యార్థులు వస్తువు తీసుకొని తమ వద్ద నగదు ఉన్నప్పుడు వేయొచ్చు.. ఇలా రెండు సంవత్సరాలుగా ఈ నిజాయితీ పెట్టెను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. మొదట్లో నిజాయితీ పెట్టెలో వస్తువులు తీసుకుని నగదు వేసే వాళ్ళు కాదు.. కానీ ప్రస్తుతం ప్రతి విద్యార్థి నగదు వేసి వస్తువులు తీసుకెళ్తున్నాడు. విద్యార్థులంతా నిజాయితీగా నడుచుకుంటున్నారనడానికి ఇదే ఉదాహరణ..

Body:బైట్1: గౌతమి (విద్యార్థిని)
బైట్2: అఖిల (విద్యార్థిని)
బైట్3: విజయలక్ష్మి (ప్రధానోపాధ్యాయిని)

Conclusion:రిపోర్టర్: లక్ష్మీపతి నాయుడు
ప్లేస్: తాడిపత్రి, అనంతపురం జిల్లా
కిట్: 759
ఫోన్: 7799077211
7093981598
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.