అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గొల్లపల్లి జలాశయం భూ నిర్వాసితులు సబ్ కలెక్టర్‌ను ఆశ్రయించారు. గొల్లపల్లి జలాశయంలో చేపలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని రైతులు సబ్ కలెక్టర్ నిశాంతిని కోరారు. జలాశయం నిర్మించడం కోసం రైతులు 1350 ఎకరాల భూములు కోల్పోయామని వాపోయారు. చేపల సంఘం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు. గొల్లపల్లిలో నివాసముంటున్న 310 కుటుంబాలకు చేపల సంఘంలో అవకాశం కల్పించాలని గ్రామస్థులు కోరారు. దీనిపై స్పందించిన సబ్ కలెక్టర్ విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి