బాదం కాయలనుకుని వాటిని తిని అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని మశానంపేటకు చెందిన ఆరుగురు ఒకేసారి అస్వస్థతకు గురయ్యారు. కాలనీకి చెందిన పిల్లలు ఆడుకోవడానికి వాగు వద్దకు వెళ్లి వాగులోని కాయలను బాదం కాయలని భావించి ఇంటికి తీసుకొచ్చారు. వాటిని నలుగురు పిల్లలతో పాటు ఇద్దరు మహిళలు తిన్నారు. కొద్దిసేపటికి అందరికీ వాంతులు కావడంతో స్థానికులు చికిత్స కోసం కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తీసుకు వచ్చారు. పరీక్షించిన వైద్యులు ప్రథమ చికిత్స అందించి ఎటువంటి ప్రమాదం లేదన్నారు.
ఇవీ చూడండి...