'రైతులకు పశువులు దూరం-కరవే కారణం' అనంతపురం జిల్లాను కరవు వెంటాడుతూనే ఉంది. పంటలు నష్టపోయి రైతులు అల్లాడిపోతుంటే, పశుగ్రాసం లేక జంతువులు ఆకలితో అలమటిస్తున్నాయి. వ్యవసాయంలో తమకు చేదోడువాదోడుగా ఉండే పశువుల ఆకలి కేకలు చూసి రైతు ఆవేదన చెందుతున్నాడు. గ్రాసం కొరతతో పశువులను కాపాడుకోలేక రైతులు వాటిని అమ్మేస్తున్నారు. మేత దొరకక ... పశువులను తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువులను ఎంతో ప్రేమతో పెంచామని, వాటికి కనీసం మేత కూడా అందించలేక విక్రయిస్తున్నామని బోరుమంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. రాయితీపై దాణా అందిస్తే పశువులను పెంచేందుకు చేయూత లభిస్తుందని కర్షకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఇసుక కొరత.. కూలీల ఉపాధికి గండి