అనంతపురం జిల్లా పెద్దయక్కలూరుకు చెందిన హాజీ బాషా చదివింది తొమ్మిదో తరగతి. అయితేనేం అతను చేసిన ఆవిష్కరణలు సైతం పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఆశ్చర్యపోయాయి. వందల అడుగుల్లో ఉన్న మోటార్లను సులువుగా బయటకు తీసే యంత్రాన్ని కనిపెట్టాడు. ఇతని ప్రతిభను గుర్తించిన ఓ సంస్థ మంచి జీతంతో ఉద్యోగం ఇచ్చింది. వ్యవసాయంపై ఉన్న ఇష్టంతో ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు. రైతులకు ఉపయోగపడేలా పరికరాల తయారీలో నిమగ్నమయ్యాడు.
డీజిల్ ఇంజిన్ ట్రాక్టర్ తయారీ
తనకు ట్రాక్టర్ కొనే స్తోమత లేనందున తానే సొంతంగా డీజిల్ ఇంజిన్ ట్రాక్టర్ తయారు చేశాడు. 5 హెచ్.పీ డీజిల్ ఇంజిన్‌కు కమాండర్ జీపు గేరు బాక్స్, పొక్లెయిన్ హైడ్రాలిక్ లిఫ్టింగ్ పరికరాలను వినియోగించి గంటకు 40 కి.మీ వెళ్లే ట్రాక్టర్‌ను రూపొందించాడు. అర లీటర్ డీజిల్‌తో గంట సమయం నడిచేలా ట్రాక్టర్ తీర్చిదిద్దాడు. అంతేకాకుండా ఈ ట్రాక్టర్‌తో దుక్కి దున్నడానికి, తెగుళ్ల నివారణక క్రిమిసంహారక మందు పిచికారి చేసేందుకు అవసరమైన పరికరాలను సైతం సొంతంగా తయారు చేసుకున్నాడు. ఆధునిక పద్ధతి ద్వారా వ్యవసాయం చేసేందుకు పరికరాలు తయారు చేయాలని ప్రయత్నించి మొదటి విఫలమైనా... పట్టు వదలకుండా ప్రయత్నించి విజయం సాధించాడు. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే రూ.1.50 లక్షలతో ఇంతకు మించి నాణ్యమైన యంత్రాలను తయారుచేసి ఇస్తానని అంటున్నాడు ఈ రైతు. ప్రస్తుతం తన మూడు ఎకరాల పొలంలో రేగు పంటను వేసి.. తన సొంత పరికరాలు వినియోగిస్తూ సాగు చేస్తున్నాడు.
ఇదీ చదవండి: