అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఎన్‌ఎన్‌పీ తండాలో విషాదం జరిగింది. తన పొలం సాగు చేయడానికి వెళ్లి అరుణ్‌కుమార్ అనే రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. పొలానికి నీరు పెట్టడానికి వెళ్లిన అతను మోటార్ ఆఫ్ చేసే సమయంలో విద్యుత్ వైర్లు చేతికి తగలటంతో ప్రమాదానికి గురై అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: