అనంతపురం జిల్లా జక్కలవడికి చెందిన గంగిరెడ్డి శ్రీధరగట్టలో ఉన్న వరి పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. మోటార్ పనిచేయని కారణంగా.. ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసి ఆన్ చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పొలంలో విగతజీవిగా పడి ఉన్న గంగిరెడ్డి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
వరికోత యంత్రానికి విద్యుత్ తీగలు తగలి ఒకరు...
కర్నూలు జిల్లా బి.కోడూరు వద్ద వరికోత యంత్రాన్ని విద్యుత్ తీగలు తగలిన ఘటనలో.. యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతుడు గుంటూరు జిల్లా మాచర్ల మండలానికి చెందిన నాగేంద్రగా గుర్తించారు. గాయపడ్డ హనుమాన్ నాయక్, అనిల్‌కు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: