ETV Bharat / state

'చంద్రబాబు కాన్వాయ్​ దాడి ఘటనపై డీజీపీ వ్యాఖ్యలు బాధాకరం' - డీజీపీ వ్యాఖ్యలపై పరిటాల సునీత ఆగ్రహం

ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కాన్వాయ్​పై దాడి జరిగితే.. దానిపై డీజీపీ వ్యాఖ్యలు బాధాకరమని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. దీనిపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందని ఆరోపించారు.

ex minister paritala sunitha fires on dgp
పరిటాల సునీత
author img

By

Published : Nov 30, 2019, 12:52 PM IST

డీజీపీ వ్యాఖ్యలు బాధాకరమన్న పరిటాల సునీత

అమరావతిలో చంద్రబాబు కాన్వాయ్​పై దాడి ఘటనపై డీజీపీ వ్యాఖ్యలు బాధాకరమని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. అనంతపురం జిల్లా జైలులో రిమాండ్​లో ఉన్న నారాయణస్వామిని తెదేపా జిల్లా అధ్యక్షుడు పార్థసారథితో కలిసి సునీత పరామర్శించారు. నిరసన తెలిపిన తీరు, దానిపై పోలీసుల అనుసరించిన వైఖరిని అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలపై నిరసన తెలిపితే.. అరెస్ట్ చేస్తారా అంటూ నిలదీశారు. రాష్ట్ర పోలీసులు ప్రతి చిన్నదానికీ కేసులు పెడుతూ తెదేపా శ్రేణులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. అమరావతిలో ప్రభుత్వం అనుసరించిన తీరును తప్పుబట్టారు. ఇలాంటి ఎన్ని చర్యలకు పాల్పడినా భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

వైకాపా ఎమ్మెల్యేలు రాజధానిలో పర్యటిస్తే అభివృద్ధి కనిపిస్తుంది'

Intro: స్క్రిప్ట్ ftp నుండి సెండ్ చేశాను సార్

Body:శింగనమల

Conclusion:కాంట్రిబ్యుటర్ : ఉమేష్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.