సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ ప్రభుత్వ ఉద్యోగులు అనంతపురంలో మనోవేదన ర్యాలీ చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆద్వర్యంలో ప్రదర్శన చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విదానాన్ని అమలు చేయాలన్నారు. నాలుగు లక్షల మంది ఉద్యోగులు ఈ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా..వెంటానే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేసే దిశగా భవిష్యత్ ప్రణాళికలు ప్రకటిస్తామన్నారు.
ఇదీ చదవండి: