ETV Bharat / state

కియా కార్ల పరిశ్రమ విస్తరణకు సహకరిస్తాం: సీఎం జగన్ - కీయా కార్ల ప్రొడెక్సన్ న్యూస్

కియా మోటార్స్ పరిశ్రమ రాష్ట్రంలో మరిన్ని యూనిట్లు ఏర్పాటుచేసి... స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోరారు. ప్రస్తుతం 70 వేల కార్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కియా సంస్థ... 3 లక్షల కార్ల ఉత్పత్తికి విస్తరించాలని ఆకాంక్షించారు. పరిశ్రమకు ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో ప్రోత్సాహం ఉంటుందని సీఎం చెప్పారు. అనంతపురం జిల్లా పెనుకొండ వద్ద కియా మోటార్స్ కార్ల పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.

Cm jagan inaugurates KIA production ceremony
కియా కార్ల పరిశ్రమ విస్తరణకు సహకరిస్తాం : సీఎం జగన్
author img

By

Published : Dec 5, 2019, 5:58 PM IST

Updated : Dec 5, 2019, 6:25 PM IST

కియా కార్ల పరిశ్రమ విస్తరణకు సహకరిస్తాం: సీఎం జగన్

అనంతపురం జిల్లాలో కియా కార్ల తయారీ పరిశ్రమలో నేటి నుంచి పూర్తిస్థాయిలో ఉత్పత్తి మొదలైంది. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సహాయ సహకారాలతో వేగవంతంగా మౌలిక సదుపాయాలు అందిపుచ్చుకున్న కియా మోటార్స్... అనుకున్న సమయానికన్నా 6 నెలలు ముందుగానే ఉత్పత్తి ప్రారంభించింది. కియా కార్లు మార్కెట్​లోకి విడుదల చేయటానికి ముందే... అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించింది.

ఆ సంస్థ ఊహించని రీతిలో అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టిన రోజునే... 6 వేలకు పైగా కార్లు బుకింగ్ చేసుకున్నారు. ఇప్పటికే కార్ల ఉత్పత్తిని ప్రారంభించిన కియా పరిశ్రమ... నేటి నుంచి పూర్తిస్థాయి సామర్థ్యం మేర కార్లను ఉత్పత్తి చేస్తోంది. ఈ గ్రాండ్ ప్రొడక్షన్ సెర్మనీ కార్యక్రమాన్ని సీఎం జగన్ ఇవాళ ప్రారంభించారు.

అన్ని విధాల సహకరిస్తాం...
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్.. కియా పరిశ్రమ మరింత విస్తరించి, ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం ఉంటుందని హామీఇచ్చారు. అంతర్జాతీయస్థాయి ప్రాజెక్టును విజయవంతంగా నెలకొల్పిన కియా బృందానికి అభినందనలు చెప్పిన సీఎం... మరెన్నో కంపెనీలు దేశంలో, ముఖ్యంగా రాష్ట్రంలో తమ ప్లాంట్లను నెలకొల్పుతాయని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. కియా త్వరలో మరిన్ని బ్రాండ్లను తీసుకొస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు. కార్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని 3 లక్షలకు పెంచడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు.

కార్యక్రమం సాగిందిలా..!
సీఎం జగన్ మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి చేరుకొని, అక్కడి నుంచి హెలికాప్టర్​లో కియా మోటార్స్ వద్దకు వెళ్లారు. కియా మోటార్స్ సీఈవో హున్ హుపార్క్, భారత-దక్షిణ కొరియా రాయభారి షిమ్ బొంగ్ కిల్​లు హెలీప్యాడ్ వద్ద ముఖ్యమంత్రి జగన్​కు స్వాగతం పలికారు. అనంతరం సీఎం, మంత్రులు గౌతంరెడ్డి, బొత్స సత్యనారాయణ, శంకరనారాయణ, జయరాంలతో కలిసి కార్ల తయారీ ప్లాంట్​ను పరిశీలించారు.

కార్ల పెయింట్ షాఫ్, ప్రెస్సింగ్ యూనిట్, అసెంబ్లింగ్ యూనిట్లను కార్​లో తిరుగుతూ జగన్ పరిశీలించారు. ప్రపంచంలో 15 చోట్ల కియా మోటార్స్ పరిశ్రమలు ఉన్నాయని... వీటిలో ఇండియా అత్యాధునిక రోబోటిక్ పరిజ్ఞానంతో ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ సీఈవో పార్క్ చెప్పారు. భారత-దక్షిణ కొరియా సంబంధాలు చాలా బలమైనవని, ఇండియాలో మరిన్ని పెట్టుబడులు పెట్టటానికి అనుకూలంగా ఉన్నట్లు... ఆ దేశానికి చెందిన భారత రాయభారి బొంగ్ కిల్ స్పష్టం చేశారు.

కియా మోటార్స్ దేశానికే గర్వ కారణమని, అత్యాధునిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమ మరింత మందికి ఉద్యోగ, ఉపాధి కల్పిస్తుందని కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి :

ఇవాళ దిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి జగన్

sample description
Last Updated : Dec 5, 2019, 6:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.