కదిరిలో ఐకాస నేతల వినూత్న నిరసన - అనంతపురం జిల్లా తాజా వార్తలు
కదిరిలో ఐకాస నేతలు ప్రదర్శన చేపట్టారు. సంప్రదాయ దుస్తులతో 42వ జాతీయ రహదారిపై వేమారెడ్డి గోడల నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాస్తారోకో చేపట్టి ప్రభుత్వ తీరును తప్పుబడుతూ నినాదాలు చేశారు. అమరావతి విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వ వైఖరి మారాలని అభిప్రాయపడ్డారు. కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన బాట పట్టినా... ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని ఐకాస నేతలు పేర్కొన్నారు.
సంప్రదాయ దుస్తులతో ఐకాస నాయకులు నిరసన
sample description