అనంతలో భాజపా గాంధీజీ సంకల్పయాత్ర.. పాల్గొన్న కన్నా - gandhi yatra news in ananthapuram
గాంధీజి ఆశయాలు ప్రజలకు గుర్తు చేసి వారిలో చైతన్యం తీసుకురావటమే లక్ష్యంగా సంకల్పయాత్ర చేస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీకేఎస్ మండలంలోని కొట్టాలపల్లి నుంచి మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణతో కలిసి పాదయాత్ర చేశారు.