ETV Bharat / state

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని తెదేపా నేతల బైక్ ర్యాలీ - అమరావతినే రాజధానిగా కొనసాగించాలని అనంతపురంలో బైక్ ర్యాలీ

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. అనంతపురం శింగనమల నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకూ తెదేపా నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంయస్ రాజు ఆరోపించారు. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన విరమించుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

bike rally in anantapur about amaravathi capital issue
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని...అనంతపురంలో బైక్ ర్యాలీ
author img

By

Published : Jan 10, 2020, 6:44 PM IST

అమరావతి కోసం తెదేపా బైక్​ ర్యాలీ

అమరావతి కోసం తెదేపా బైక్​ ర్యాలీ

ఇదీ చూడండి:

గళమెత్తిన మహిళా లోకం.. ఎక్కడికక్కడ అరెస్టులు

Intro:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజదాని గా అమరావతి నే కొనసాగించాలని బైక్ ర్యాలీ....

కొనసాగుతున్న మూడు రాజదానుల వివాదం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ది నినాదంతో 3 రాజదానులు ప్రకటించడంతో సర్వత్రా విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.

అమరావతి రాజదాని ముద్దు విశాఖపట్టణం వద్దు అనే నినాదంతో ఆమరావతి పరిరక్షణ సమితి అద్వర్యంలో శింగనమల నుండి అనంతపురం ఎన్టీఆర్ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. శింగనమల మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఈ ర్యాలీని ప్రారంభించారు.

అమరావతిగా రాజదానిని కొనసాగించెందుకు ఆ ప్రాంత రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు త్యాగం చేసి ఇచ్చారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఆమరావతి మద్య ప్రాంతంగా ఉంటుందన్నారు. అయితే వైసీపీ నాయకులు ప్రజలను తప్పుదోవపట్టీస్తోందని మండిపడ్డారు. వైసీపీ తుప్పు పట్టిన విదానాలను మార్చుకొవాలని లేకుంటే సంక్రాంతి తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టి అందోళనలను ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు..

బైట్1: టీడీపీ జిల్లా అద్యక్షుడు బికె పార్థసారథి....

బైట్ 2: రాష్ట్ర ఎస్సీ సెల్ అద్యక్షుడు ఎం యస్ రాజు....


Body:సింగనమల


Conclusion:కాంట్రిబ్యుటర్ : ఉమేష్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.