అనంతపురం జిల్లా ధర్మవరంలో ఇరువర్గాల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. తెదేపా కార్యకర్త నాగేంద్ర... వైకాపా నాయకుడు గడ్డం కుమార్ అనే వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో కుమార్తో పాటు గొడవను అడ్డుకోబోయిన మహమ్మద్ రఫీకి గాయాలయ్యాయి. బాధితులిద్దరినీ గ్రామస్తులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు... ఆసుపత్రికి చేరుకుని కుమార్ నుంచి వివరాలు సేకరించారు. కూరగాయల మార్కెట్లో తెల్లవారుజామున ఇద్దరి మధ్య మాటలు పెరిగి ఘర్షణకు దారి తీసినట్లు స్థానికులు తెలిపారు.
ఇవీ చదవండి