ఆగి ఉన్న లారీని బొలెరో వాహనం ఢీకొని డ్రైవర్ మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లాలోని ప్రధాన రహదారిపై జరిగింది. కళ్యాణదుర్గం నుంచి అనంతపురం వైపు వెళ్తున్న కర్ణాటక వాహనం కాలువపల్లి వద్ద సిమెంట్ లారీని ఢీకొట్టింది.ఈ ఘటనలో బొలెరో డ్రైవర్ మురగన్(25) అక్కడిక్కడే చనిపోయాడు. స్థానికులు అతికష్టం మీద వాహనంలో ఇరుక్కుపోయిన డ్రైవర్ను బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండిఆ బడిలో గోడలు పాఠాలు చెబుతాయి!