తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్.. టోక్యో ఒలింపిక్స్ అర్హత టోర్నీ కోసం బాక్సింగ్ ట్రయల్స్‌లో పోటీ పడే అవకాశం దక్కించుకుంది. ఈ నెల 27, 28 తేదీల్లో దిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించే ట్రయల్స్‌లో 51 కేజీల విభాగంలో పోటీ పడనుంది.
ఈ విభాగంలో దిగ్గజ బాక్సర్ మేరీకోమ్, జ్యోతి గులియా, రితు గ్రెవాల్ ఇప్పటికే ట్రయల్స్‌కు అర్హత సాధించారు. మిగిలిన ఒక్క బెర్తును నిఖత్‌కు కేటాయిస్తున్నట్లు భారత బాక్సింగ్ సమాఖ్య సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. ఈ నలుగురి మధ్య పోటీలో విజేతగా నిలిచే బాక్సర్ టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్తుంది.
మొదట మేరీకోమ్-రితు, నిఖత్-జ్యోతిల మధ్య బౌట్స్ జరుగుతాయి. విజేతలు ఫైనల్లో తలపడతారు. మేరీకోమ్ ఫైనల్ చేరడం లాంఛనమే అని భావిస్తున్నారు. కొన్నాళ్లుగా ఆమెను సవాల్ చేస్తూ వస్తున్న నిఖత్.. తుది పోరుకు అర్హత సాధించి, ఈ దిగ్గజ బాక్సర్‌ను జయించి టోక్యో అర్హత టోర్నీకి వెళ్తుందేమో చూడాలి.
బీబీఎల్ విజేత గుజరాత్ జెయింట్స్:
బిగ్బౌట్ ఇండియన్ బాక్సింగ్ లీగ్ అరంగేట్ర సీజన్లో గుజరాత్ జెయింట్స్ విజేతగా నిలిచింది. శనివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో గుజరాత్ 4-3తో పంజాబ్ పాంథర్స్‌ను ఓడించింది.
ఇదీ చదవండి: కోట్లు పెట్టి కొంటే కోటి ఆశలు కల్పిస్తున్నారు..!