దేశ విభజన సమయంలో కుటుంబం మొత్తం కళ్ల ముందే ఊచకోత.. పాకిస్థాన్ నుంచి కట్టుబట్టలతో భారత్‌కు రాక.. టీనేజీలో దొంగగా ముద్ర.. సీన్ కట్ చేస్తే.. అతడో పరుగుల వీరుడు.. 400 మీటర్ల రేసులో ప్రపంచ రికార్డు.. ఫ్లయింగ్ సిక్కు అంటూ పాకిస్థాన్ రాష్ట్రపతి చేత ప్రశంసలు అందుకున్నాడు. అతడే మిల్కా సింగ్. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కథనం.
1929 నవంబరు 20న పంజాబ్‌లోని గోవిందపురా(ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది)లో జన్మించాడు మిల్కా సింగ్. టీనేజీలో పాకిస్థాన్ నుంచి వలసవచ్చిన మిల్కా.. శరణార్థుల శిబిరంలో తలదాచుకున్నాడు. అనంతరం భారత సైనిక దళంలో చేరి.. ఫీల్డ్ అండ్ ట్రాక్ ఈవెంట్లో తానేంటో నిరూపించుకున్నాడు.
ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకం
1958 ఆసియా క్రీడల్లో పాల్గొని 200 మీటర్ల విభాగంలో స్వర్ణం నెగ్గాడు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతకుముందే 400 మీటర్ల విభాగంలో జాతీయ రికార్డు నమోదు చేసిన ఇతడు.. 1956 విశ్వక్రీడలకు అర్హత సాధించాడు. అయితే ఈ పోటీల్లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. అనంతరం 1958లో జరిగిన ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాలు నెగ్గి ప్రపంచ వేదికపై భారత్ జెండాను ఎగురవేశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
త్రుటిలో ఒలింపిక్ పతకం మిస్
1960 రోమ్ ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకం చేజార్చుకున్నాడు. 1962 జకార్తా ఆసియా క్రీడల్లో మళ్లీ సత్తాచాటాడు. 400మీటర్లు, 4X400 మీటర్ల రిలేలో పసిడి పతకాలు కైవసం చేసుకున్నాడు. క్రీడల్లో మిల్కా సింగ్ కృషికిగాను 1959లో భారత ప్రభుత్వం.. పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.
400 మీటర్లలో ప్రపంచ రికార్డు
400 మీటర్ల రేసులో మిల్కా సింగ్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అప్పటివరకున్న 45.9 సెకన్ల రికార్డు బ్రేక్ చేస్తూ, కొత్త టైమింగ్‌ను(45.8 )నెలకొల్పాడు. జాతీయ స్థాయిలో ఈ రికార్డును 2006 వరకు ఎవరూ బ్రేక్ చేయలేకపోవడం విశేషం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
బాలీవుడ్లో బయోపిక్
మిల్కాసింగ్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో 'భాగ్ మిల్కా భాగ్' చిత్రాన్ని రూపొందించారు. 2013లో విడుదలైంది. ఇందులో ఫర్హాన్ అక్తర్.. మిల్కా పాత్ర పోషించాడు. ఇందులోని పాత్రకుగాను ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడిగా నిలిచాడు ఫర్హాన్. పలు అవార్డులనూ అందుకుందీ చిత్రం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: షూటింగ్ ప్రపంచకప్‌లో భారత షూటర్లకు నిరాశ