క్రీడల్లో చివరి క్షణం వరకు ఏం జరుగుతుందో చెప్పలేము. అందులోనూ బాస్కెట్ బాల్, ఫుట్బాల్ లాంటి ఆటల్లో ఈ ఉత్కంఠ మరీ ఎక్కువగా ఉంటుంది. తాజాగా బాస్కెట్ బాల్ యూరోలీగ్లో బేయర్న్ మ్యూనిక్తో జరిగిన మ్యాచ్లో జెనిత్ సెయింట్ పీటర్బర్గ్ ప్లేయర్ అద్భుత రీతిలో బాస్కెట్లో బంతిని వేశాడు.
మరో నాలుగున్నర సెకండ్లలో సెకండ్ క్వార్టర్ ముగిస్తుందనుకున్న తరుణంలో జెనిత్ ఆటగాడు అలెక్స్ రెన్ఫ్రో ఆ కొద్దిపాటి కాలంలోనే బాస్కెట్లో బంతిని వేశాడు. అందులోనూ కోర్టు మధ్యలో నుంచే బాస్కెట్లోకి విసరడం విశేషం. అప్పటికే మ్యూనిక్ జట్టు 37-32 తేడాతో లీడ్లో ఉంది. ఈ మ్యాచ్లో బేయర్న్ మ్యూనిక్ జట్టు 77-69 తేడాతో విజయం సాధించింది.
ఇదీ చదవండి: వన్డే సిరీస్: భువి పోయే.. శార్దుల్ వచ్చే