ఎట్టకేలకు భారత ఆర్చరీ అసోసియేషన్(ఏఏఐ) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. జనవరి 18న దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా ఓటింగ్ జరగనుంది. పీకే త్రిపాఠిని ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా దిల్లీ హైకోర్టు నియమించింది.
ఆర్చరీ అసోసియేషన్‌కు ఎన్నికలు నిర్వహించాలని దిల్లీ కోర్టు అక్టోబరులో ఉత్తర్వులు జారీ చేసింది. అధ్యక్షుడు, సీనియర్ ఉపాధ్యక్షుడు, వైస్ ప్రెసిడెంట్8) పదవులకు ఎన్నికలు జరపాలని నవంబరులో ఆ ఆదేశాలను సవరించింది. వీటితో పాటు సెక్రటరీ జనరల్, జాయింట్ సెక్రటరీలు(7), కోశాధికారి పదవులకు ఎలక్షన్ జరగనుంది.
ఈ ఎలక్టోరల్ జాబితాలో మొత్తం 31రాష్ట్రాల అసోసియేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, జమ్ము-కశ్మీర్, నాగాలాండ్ ఈ ఎన్నికలకు గైర్హాజరు కానున్నాయి.
వరల్డ్ ఆర్చరీ ఫెడరేషన్.. ఆగస్టులో ఏఏఐపై వేటు వేసింది. అంతర్జాతీయ సంఘం నిబంధనలు ఉల్లంఘించి.. వైషమ్యాలతో రెండు గ్రూపులుగా విడిపోయిన కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదీ చదవండి: ఆటగాళ్లు ఎన్సీఏకు తప్పనిసరిగా వెళ్లాల్సిందే: గంగూలీ