టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతకు అడుగు దూరంలో నిలిచాడు. ఒక్క పరుగు చేస్తే పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించనున్నాడు. ప్రస్తుతం రోహిత్‌తో పాటు సమానంగా ఉన్న కోహ్లీ.. శ్రీలంకతో ఆదివారం నుంచి జరగనున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆ ఘనత సాధించే అవకాశముంది.
టీ20ల్లో ఇరువురు 2,633 పరుగులతో సమానంగా ఉన్నారు. శ్రీలంకతో సిరీస్‌కు రోహిత్‌కు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో కోహ్లీ నెంబర్ వన్‌పై కన్నేశాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో విరాట్ సత్తాచాటితే అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకునే అవకాశముంది.
పొట్టి ఫార్మాట్లో ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్న కోహ్లీ.. విండీస్‌తో గత నెలలో జరిగిన టీ20 సిరీస్‌లో అదరగొట్టేశాడు. మూడు మ్యాచ్‌ల్లో రెండు అర్ధశతకాలతో(94, 70) సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అదే ఫామ్‌ను లంకతో సిరీస్‌లోనూ కొనసాగించి అరుదైన ఘనత సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ఆదివారం గుహవటి వేదికగా శ్రీలంకతో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నెల 7న ఇండోర్‌లో రెండో టీ20 జరగనుంది. ఈ నెల 10న పుణె వేదికగా ఆఖరి టీ20 నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: తొలి టీ20లో ప్లకార్డులు, బ్యానర్లు బ్యాన్..!