పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్‌గా పేరున్న ఆటగాడు లసిత్ మలింగ. ఎన్నో రికార్డులు సాధించిన ఈ ఆటగాడు.. ఎందరో యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలిచాడు. అతడి జుట్టుతోనూ, బౌలింగ్ శైలితోనూ ఎంతో మందిని ఆకట్టుకున్నాడు. అలాంటి క్రికెటర్‌కు ఏకలవ్య శిష్యుడిగా వచ్చాడు.. శ్రీలంకకు చెందిన 17 ఏళ్ల యువ క్రీడాకారుడు మతీశ పతిరణ. ఇటీవల కాలేజ్ క్రికెట్ స్థాయిలో రాణించి అండర్-19 ప్రపంచకప్‌కు ఎంపికయ్యాడు. ఇప్పుడు ఇక్కడా బ్యాట్స్‌మెన్‌కు వణుకుపుట్టిస్తున్నాడు.
ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పతిరణకు ఒక్క వికెట్ దక్కలేదు. కానీ ఒక ప్రపంచ రికార్డును మాత్రం ఖాతాలో వేసుకున్నాడీ బౌలర్. పాకిస్థాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పిలవబడే షోయబ్ అక్తర్ ఫాస్టెస్ట్ బాల్ రికార్డును ఈ యువ ఆటగాడు బ్రేక్ చేశాడు. నిన్నటి మ్యాచ్‌లో పతిరణ 175 కి.మీ వేగంతో బంతిని సంధించి కొత్త వరల్డ్ రికార్డును నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ స్థాయిలోనైనా ఇదే అత్యంత వేగవంతమైన బాల్. 2003 ప్రపంచకప్‌లో అక్తర్ 161.3కి.మీ వేగంతో వేసిన బంతి ఇప్పటివరకూ ఫాస్టెస్ట్ బాల్‌గా ఉంది.
-
Sri-Lankan U19 Pacer Pathirana clocked a stunning 175 kph on the speed gun in #U19CWC match Against India on a Wide Ball.
— Mahirat 🏏 (@GOATKingKohli) January 20, 2020 ట" class="align-text-top noRightClick twitterSection" data="
On the right corner of the screen, the speed of the delivery showed at 108 mph. #INDvSL #INDU19vSLU19 #Cricket #CWCU19 pic.twitter.com/7uKD73zYn0
ట">Sri-Lankan U19 Pacer Pathirana clocked a stunning 175 kph on the speed gun in #U19CWC match Against India on a Wide Ball.
— Mahirat 🏏 (@GOATKingKohli) January 20, 2020
On the right corner of the screen, the speed of the delivery showed at 108 mph. #INDvSL #INDU19vSLU19 #Cricket #CWCU19 pic.twitter.com/7uKD73zYn0
టSri-Lankan U19 Pacer Pathirana clocked a stunning 175 kph on the speed gun in #U19CWC match Against India on a Wide Ball.
— Mahirat 🏏 (@GOATKingKohli) January 20, 2020
On the right corner of the screen, the speed of the delivery showed at 108 mph. #INDvSL #INDU19vSLU19 #Cricket #CWCU19 pic.twitter.com/7uKD73zYn0
ఇవీ చూడండి.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా