ETV Bharat / sports

షెఫాలి, దీప్తి విజృంభణ.. విండీస్​పై భారత్ ఘనవిజయం - shefali varma halfcentuary

భారత మహిళా ఓపెనర్ షెఫాలి వర్మ మరోసారి అర్ధశతకంతో ఆకట్టుకుంది. ఫలితంగా విండీస్ మహిళా జట్టుతో జరిగిన రెండో టీ20లో భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్ దీప్తి శర్మ (4/10) చక్కటి ప్రదర్శనతో కరీబియన్ అమ్మాయిలు 7 వికెట్ల నష్టానికి 103 పరుగులే చేయగలిగారు.

భారత్ - విండీస్​
author img

By

Published : Nov 11, 2019, 12:45 PM IST

వెస్టిండీస్ మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్​లో మరోసారి విజృంభించింది భారత మహిళా జట్టు ఓపెనర్ షెఫాలి వర్మ(69). సెయింట్ లూసియా వేదికగా జరిగిన రెండో టీ20లో ఆమె అర్ధశతకంతో ఆకట్టుకోగా. మరో స్టార్ ఓపెనర్ స్మృతి మంధానా 30 పరుగులతో నిలకడగా ఆడింది. ఫలితంగా టీమిండియా అమ్మాయిలు 10 వికెట్ల తేడాతో గెలిచారు. 5 టీ20ల సిరీస్​లో 2-0తో ఆధిక్యంలోకి వెళ్లారు.

మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 103 పరుగులే చేసింది. కరీబియన్​ జట్టులో చెడీన్ నేషన్(32) మినహా మిగతా వారు విఫలమయ్యారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 10 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసింది. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న దీప్తికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

Shefali Verma, Smriti Mandhana guide India women to 10-wicket win over West Indies
దీప్తి శర్మ

104 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలో దిగిన టీమిండియాలో ఓపెనర్లు అదరగొట్టారు. వికెట్ కోల్పోకుండా.. 10.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేశారు. ముఖ్యంగా షెఫాలి వర్మ 35 బంతుల్లో 69 పరుగులతో మరోసారి విధ్వంసం సృష్టించింది. ఇందులో 10 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. శనివారం జరిగిన తొలి టీ20లో 73 పరుగులతో ఆకట్టుకున్న ఈ 15ఏళ్ల యువ క్రీడాకారిణి రెండో మ్యాచ్​లోనూ అదే రీతిలో ఆకట్టుకుంది. స్టార్ ఓపెనర్ స్మృతి 30 పరుగులు చేసి షెఫాలీకి సహకరించింది.

ఇదీ చదవండి: కష్టానికి తగిన ఫలితం దక్కింది: చాహర్

AP Video Delivery Log - 0400 GMT News
Monday, 11 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0326: Hong Kong Shooting Protest AP Clients Only 4239192
HK police shoot protester as activists block streets
AP-APTN-0312: Venezuela Bolivia Maduro Reax AP Clients Only 4239190
Maduro reacts to Morales' resignation
AP-APTN-0246: Australia Remembrance Day No access Australia 4239189
Australia marks Remembrance Day
AP-APTN-0243: Hong Kong Shooting UGC Must credit content creator 4239188
UGC: Hong Kong police shoot at protesters
AP-APTN-0200: Spain Podemos AP Clients Only 4239187
Podemos leader analyses election results
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.