ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు.. ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో సత్తా చాటుతున్నారు. ఐపీఎల్ వేలంలో భారీ మొత్తం దక్కించుకున్న క్రికెటర్లు ఈ లీగ్ తొలి మ్యాచ్‌లో అదరగొట్టేశారు. మరికొందరు మాత్రం కాస్త నిరాశపరిచారు. డిసెంబర్ 17న ప్రారంభమైన ఈ టోర్నీలో.. ఇప్పటికి 6 మ్యాచ్‌లు జరిగాయి. అందులో ఐపీఎల్లో పాల్గొననున్న ఆటగాళ్ల ప్రదర్శనను ఓసారి చూద్దాం.
టామ్ బాంటన్.. (1 కోటి), కోల్‌కతా
ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్లో బ్యాటింగ్‌తో సంచలనం రేపిన టామ్ బాంటన్.. ఐపీఎల్ వేలంలో కోటి రూపాయలు పలికాడు. ఊహించని రీతిలో అతడిని భారీ ధరకు సొంతం చేసుకుంది కోల్‌కతా నైట్‌రైడర్స్. అయితే ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాష్ లీగ్‌లో అరంగేట్రంలోనే సత్తా చాటుతున్నాడు. బ్రిస్బేన్ హీట్ తరపున ఆడుతోన్న టామ్.. మెల్‌బోర్న్ స్టార్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అర్ధశతకం చేశాడు. 36 బంతుల్లో 64 రన్స్ సాధించాడు. ఇందులో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.
-
102m, if you don't mind! Unfortunately, we've seen the last of Tom Banton for the night, but that was great! #BBL09 pic.twitter.com/XBZ7HfdPha
— KFC Big Bash League (@BBL) December 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">102m, if you don't mind! Unfortunately, we've seen the last of Tom Banton for the night, but that was great! #BBL09 pic.twitter.com/XBZ7HfdPha
— KFC Big Bash League (@BBL) December 20, 2019102m, if you don't mind! Unfortunately, we've seen the last of Tom Banton for the night, but that was great! #BBL09 pic.twitter.com/XBZ7HfdPha
— KFC Big Bash League (@BBL) December 20, 2019
మిచెల్ మార్ష్.. (2 కోట్లు), హైదరాబాద్
ఆస్ట్రేలియాకు చెందిన ఈ ఆల్‌రౌండర్ ప్రస్తుతం పెర్త్ స్కాచర్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో తొలి మ్యాచ్‌లో 22 బంతుల్లో 56 రన్స్ చేశాడు. ఇందులో ఒక ఫోర్, 6 సిక్సర్లు ఉన్నాయి. 254.55 స్ట్రయిక్ రేటుతో పరుగులు చేశాడు. ఇతడిని రూ. 2 కోట్లకు దక్కించుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్.
-
You win this bout, Mitch. The @ScorchersBBL skipper belted six 6️⃣s in his 56no 😎 @KFCAustralia | #BBL09 pic.twitter.com/v7dn2IEthp
— KFC Big Bash League (@BBL) December 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">You win this bout, Mitch. The @ScorchersBBL skipper belted six 6️⃣s in his 56no 😎 @KFCAustralia | #BBL09 pic.twitter.com/v7dn2IEthp
— KFC Big Bash League (@BBL) December 21, 2019You win this bout, Mitch. The @ScorchersBBL skipper belted six 6️⃣s in his 56no 😎 @KFCAustralia | #BBL09 pic.twitter.com/v7dn2IEthp
— KFC Big Bash League (@BBL) December 21, 2019
కేన్ రిచర్డ్సన్.. (4 కోట్లు), బెంగళూరు
ఆసీస్‌కు చెందిన ఈ బౌలర్.. మెల్‌బోర్న్ రెనిగేడ్స్ తరఫున ఆడుతున్నాడు. ఆరంభ మ్యాచ్‌లో 4 వికెట్లు తీశాడు. 5.50 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. ఇతడిని 4 కోట్ల ధర వెచ్చించి కొనుక్కుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
-
Kane Richardson took a handy four-wicket haul for the @renegadesBBL, and saved the very best for the last of the lot! @dream11 | #BBL09 pic.twitter.com/E83XVoYeCi
— KFC Big Bash League (@BBL) December 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Kane Richardson took a handy four-wicket haul for the @renegadesBBL, and saved the very best for the last of the lot! @dream11 | #BBL09 pic.twitter.com/E83XVoYeCi
— KFC Big Bash League (@BBL) December 21, 2019Kane Richardson took a handy four-wicket haul for the @renegadesBBL, and saved the very best for the last of the lot! @dream11 | #BBL09 pic.twitter.com/E83XVoYeCi
— KFC Big Bash League (@BBL) December 21, 2019
క్రిస్ జోర్డాన్.. (3 కోట్లు), పంజాబ్
ఇంగ్లాండ్‌కు చెందిన ఆల్‌రౌండర్ జోర్డాన్.. పెర్త్ స్కాచర్స్ తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. ఇందులో రెండు వికెట్లు తీయడమే కాకుండా అద్భుతమైన ఫీల్డింగ్‌తో 3 క్యాచ్‌లు పట్టి ఆకట్టుకున్నాడు. ఇతడిని రూ. 3 కోట్లకు కొనుగోలు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.
-
Chris Jordan, ARE YOU KIDDING ME!!! #BBL09 pic.twitter.com/kZZf2yMWxF
— KFC Big Bash League (@BBL) December 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Chris Jordan, ARE YOU KIDDING ME!!! #BBL09 pic.twitter.com/kZZf2yMWxF
— KFC Big Bash League (@BBL) December 21, 2019Chris Jordan, ARE YOU KIDDING ME!!! #BBL09 pic.twitter.com/kZZf2yMWxF
— KFC Big Bash League (@BBL) December 21, 2019
మ్యాక్స్‌వెల్.. (10.75 కోట్లు), పంజాబ్
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచైజీకి, అభిమానులకు ఆనందం కలిగించాడు. వేలంలో రూ.10.75 కోట్ల ధర దక్కించుకున్న మరుసటి రోజే విధ్వంసం సృష్టించాడు. బిగ్‌బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్‌కు ఆడుతున్న అతడు 39 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు. మొత్తం 7 బౌండరీలు, 5 సిక్సర్లు బాదేశాడు. తాజాగా జరిగిన వేలంలో రెండో అత్యంత భారీ ధర పొందిన విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
-
83 from 39 balls from @Gmaxi_32 at Metricon Stadium, including seven 4️⃣s and five 6️⃣s 🔥@dream11 | #BBL09 pic.twitter.com/6Hhha21YsP
— KFC Big Bash League (@BBL) December 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">83 from 39 balls from @Gmaxi_32 at Metricon Stadium, including seven 4️⃣s and five 6️⃣s 🔥@dream11 | #BBL09 pic.twitter.com/6Hhha21YsP
— KFC Big Bash League (@BBL) December 20, 201983 from 39 balls from @Gmaxi_32 at Metricon Stadium, including seven 4️⃣s and five 6️⃣s 🔥@dream11 | #BBL09 pic.twitter.com/6Hhha21YsP
— KFC Big Bash League (@BBL) December 20, 2019
టామ్ కరన్...
ఇంగ్లాండ్‌కు చెందిన ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్ బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడుతున్నాడు. జట్టు ఆరంభ మ్యాచ్‌లో మూడు వికెట్లతో రాణించాడు. అయితే ఈ మ్యాచ్‌లో 8 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు.
- లీగ్‌లో సత్తా చాటాల్సివాళ్లు...
ఈ లీగ్‌లో ఆడుతున్న కొంత మంది ఆటగాళ్లు ఐపీఎల్లో భారీ ధర పలికినా ఆరంభ మ్యాచ్‌లో నిరాశపర్చారు. మరి వీరిపై ఫ్రాంఛైజీలు చాలా ఆశలు పెట్టుకున్నాయి.
ఫించ్.. (4.40 కోట్లు) ఆర్సీబీ
ఆసీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఆరోన్ ఫించ్‌ను భారీ ధరకు కొనుక్కొంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే బిగ్‌బాష్‌లో మెల్‌బోర్న్ రెనిగేడ్స్ తరఫున ఆడుతున్న ఇతడు.. ఆరంభ మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేదు. 22 బంతుల్లో 29 పరుగులే చేశాడు.
క్రిస్ లిన్.. (2 కోట్లు) ముంబయి
ఈ ఆసీస్ బ్యాట్స్‌మన్‌ను వేలంలో 2 కోట్లకు కొనుక్కుంది ముంబయి జట్టు. బ్రిస్బేన్ హీట్ తరఫున ఆడుతున క్రిస్ లిన్.. ఆరంభమ్యాచ్‌లో పెద్దగా రాణించలేదు. 9 బంతుల్లో 9 పరుగులే చేశాడు. ఇతడి నిలకడ లేమి కారణంగా గత ఐపీఎల్ యాజమాన్యం కోల్‌కతా ఇతడిని అట్టిపెట్టుకోలేదు.
మార్కస్ స్టొయినిస్.. (4.5 కోట్లు), దిల్లీ
మెల్‌బోర్న్ స్టార్స్ తరఫున ఆడుతున్న ఈ ఆల్‌రౌండర్... 19 బంతుల్లో 16 రన్స్ చేశాడు. బౌలింగ్ అవకాశం రాలేదు. అయితే ఇతడిని రూ. 4.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది దిల్లీ క్యాపిటల్స్.