టీమిండియా బౌలింగ్ విభాగంపై ప్రశంసలు కురిపించాడు దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ డేల్ స్టెయిన్. ప్రస్తుతం భారత ఫాస్ట్ బౌలర్లు ప్రపంచంలోనే అత్యుత్తమంగా రాణిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇటీవల ఐపీఎల్ వేలంలో ఆర్సీబీ జట్టులో చోటు దక్కించుకున్నాడీ సఫారీ జట్టు సీనియర్ బౌలర్. అనంతరం అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు.
మీ ఫేవరెట్ బ్యాట్స్‌మన్ ఎవరని స్టెయిన్‌ను ఓ నెటిజన్ అడిగ్గా... ముగ్గురి పేర్లను వెల్లడించాడు. క్వింటన్ డికాక్, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ అని తెలిపాడు. దక్షిణాఫ్రికా జాతీయ జట్టులో డికాక్, డివిలియర్స్‌తో ఆడిన అనుభవం స్టెయిన్ సొంతం. ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున కోహ్లీ కెప్టెన్సీలోనూ ఆడాడు. అందుకే ముగ్గురి బ్యాట్స్మెన్తోనూ అతడికి బలమైన అనుబంధం ఉంది.
-
QDK, Ab, Virat
— Dale Steyn (@DaleSteyn62) December 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">QDK, Ab, Virat
— Dale Steyn (@DaleSteyn62) December 21, 2019QDK, Ab, Virat
— Dale Steyn (@DaleSteyn62) December 21, 2019
టెస్టుల్లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలింగ్ జట్టు ఏదని మరో నెటిజన్ అడగ్గా " కష్టతరమైన ప్రశ్న" అని పేర్కొంటూ.. టీమిండియాకే నా ఓటు అని చెప్పాడు.
-
Tight call.... probably gana go with India
— Dale Steyn (@DaleSteyn62) December 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Tight call.... probably gana go with India
— Dale Steyn (@DaleSteyn62) December 21, 2019Tight call.... probably gana go with India
— Dale Steyn (@DaleSteyn62) December 21, 2019
గురువారం కోల్‌కతాలో నిర్వహించిన ఐపీఎల్ 2020 వేలంలో.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టెయిన్‌ను రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 92 మ్యాచ్‌లు ఆడాడు స్టెయిన్. 96 వికెట్లు తీశాడు.