బంగ్లాదేశ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు టీమిండియా జట్టు సిద్ధమైంది. పొట్టి ఫార్మాట్ మ్యాచ్‌లకు కోహ్లీకి విశ్రాంతి నిచ్చింది యాజమాన్యం. గతేడాది అక్టోబర్ నుంచి టీమిండియా 56 టీ20ల్లో తలపడగా.. విరాట్ 48 మ్యాచుల్లో ఆడాడు. అన్ని ఫార్మాట్లు ఆడుతున్న ఈ స్టార్ బ్యాట్స్‌మన్ ఎక్కువగా విశ్రాంతి తీసుకోలేదు. అందుకే ఈ నెల 24 నుంచి బంగ్లాతో పొట్టి క్రికెట్ సమరానికి అతణ్ని దూరంపెట్టింది సెలక్టర్ల కమిటీ.
పంత్‌కు మళ్లీ అవకాశం...
ఇటీవల ఫేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న పంత్‌కు మళ్లీ అవకాశం లభించింది. టీ20ల్లో రాణించగల మంచి బ్యాటింగ్ నైపుణ్యం అతడి సొంతం. అందుకే ఇతడిని సెలక్టర్ల బృందం ఎంపిక చేసింది. స్టాండ్‌బై కీపర్‌గా టెస్టులోనూ చోటు దక్కించుకున్నాడీ ఆటగాడు.
టీ20లకు రోహిత్ కెప్టెన్‌గా బాధ్యత వహించనున్నాడు. శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ కీలకంగా మారనున్నారు. విజయ్ హజారే ట్రోఫీలో సత్తా చాటిన సంజూ శాంసన్, యువ ఆల్‌రౌండర్ శివమ్ దూబే 15 మంది జట్టులో చోటు దక్కించుకున్నారు. టీమిండియా మాజీ సారథి ధోనీ ఈ సిరీస్‌లకూ దూరమయ్యాడు.
ఇవే వేదికలు...
బంగ్లాతో తొలి టీ20 దిల్లీ (నవంబర్ 3), రెండో మ్యాచ్ రాజ్‌కోట్ (7న), మూడో పోరు నాగ్‌పూర్ (10న)లో జరుగుతాయి. ఇండోర్, కోల్‌కతా వేదికలుగా... రెండు టెస్టుల ప్రపంచ ఛాంపియన్‌షిప్ నవంబర్ 14న నుంచి ఆరంభమవుతుంది.
15 మంది జాబితా ఇదే...
టీ20 జట్టు: రోహిత్‌శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్(కీపర్), వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్య, చాహల్, రాహుల్ చాహర్, దీపక్ చాహర్, ఖలీల్ అహ్మద్, శివమ్ దూబే, శార్దూల్ ఠాకుర్
టెస్టు జట్టు: కోహ్లీ (సారథి), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, హనుమ విహారీ, సాహా(కీపర్), రవీంద్ర జడేజా, ఆర్. అశ్విన్, కుల్దీప్ యాదవ్, షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్