టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అభిమానించే వాళ్లు, అనుకరించే వాళ్లు ఇక్కడే కాదు విదేశాల్లోనూ ఎంతో మంది ఉన్నారు. చిన్నపిల్లలను నుంచి వయసుపైబడిన వాళ్ల వరకు విరాట్ బ్యాటింగ్ శైలిని ఇష్టపడేవాళ్లు కోకొల్లలు. ఇప్పుడీ జాబితాలోకి స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూతురు ఇండి రే చేరింది. చిన్నబ్యాట్తో క్రికెట్ ఆడుతూ 'ఐ యామ్ విరాట్ కోహ్లీ(నేను విరాట్ కోహ్లీని)' అంటూ అతడిని అనుకరిస్తోంది.
-
This little girl has spent too much time in India. Wants to be @imVkohli pic.twitter.com/Ozc0neN1Yv
— Candice Warner (@CandyFalzon) November 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">This little girl has spent too much time in India. Wants to be @imVkohli pic.twitter.com/Ozc0neN1Yv
— Candice Warner (@CandyFalzon) November 10, 2019This little girl has spent too much time in India. Wants to be @imVkohli pic.twitter.com/Ozc0neN1Yv
— Candice Warner (@CandyFalzon) November 10, 2019
విరాట్‌లా అవుతానంటూ ఇండి రే క్రికెట్ ఆడుతోన్న వీడియోను వార్నర్ భార్య కాండిస్ ట్విట్టర్లో పంచుకుంది. ఐపీఎల్, భారత్‌లో ఆస్ట్రేలియా జట్టు పర్యటించినపుడు వార్నర్‌తో పాటు ఇక్కడ చాలా రోజులు గడిపింది ఇండి.
ఇటీవల శ్రీలంకతో టీ20 సిరీస్‌లో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు వార్నర్. మూడు మ్యాచ్‌ల్లో 217 పరుగులు చేశాడు. 2వేల పరుగుల మైలురాయి అధిగమించిన తొలి ఆసీస్ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
ఇదీ చదవండి: కేపీఎల్ ఫిక్సింగ్ కేసులో అంతర్జాతీయ బుకీ అరెస్టు